మాజీ రంజీ క్రికెటర్ సురేష్ కుమార్ (47) ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి ఆయన తన నివాసంలో ఉరేసుకుని కనిపించారు. ఆయన తన ఇంట్లోనే బెడ్ రూంలో రాత్రి 7.15 గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో దీనిని ఆత్మహత్యగా చెపుతున్నా ఇందుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. కేరళలోని అలప్పూజకు చెందిన సురేష్‌కుమార్ 1991 – 20067 మధ్య కేరళ తరపున రంజీ మ్యాచ్‌లు ఆడాడు.
మొత్తం 72 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 1,657 పరుగులు చేసిన కుమార్, 196 వికెట్లు తీశాడు. కేరళ తరఫు కూడా 52 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్న సురేష్.. రైల్వేస్ తరఫున 17 మ్యాచ్‌లు ఆడాడు. అలాగే దేశవాళీ టోర్నీలు అయిన సౌత్ జోన్, సెంట్రల్ జోన్ తరఫున దులీప్ ట్రోపీలో కూడా ఆడాడు.దేశవాలీ క్రికెట్‌లో రాణించాడు. సురేష్ కుమార్ బౌలింగ్ ఎంతో వైవిధ్యంగా ఉండేది.
దేశవాళీ టోర్నీలలో సురేష్ రాణించినా అతడికి జాతీయ జట్టులో మాత్రం చోటు లభించలేదు. అయితే అతడి బౌలింగ్‌ను ఎంతో మంది స్టార్ క్రికెటర్లు ఇష్టపడేవారు. టీమీండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ వంటివారు సురేష్ బౌలింగ్ సామర్థ్యంపై ప్రశంసలు కురిపించారు. ఇక, సురేష్‌కు భార్య మంజు, కుమారుడు అతుల్ ఉన్నారు. సురేష్ ఆత్మహత్యతో పలువురు క్రికెటర్లు సంతాపం తెలుపుతున్నారు.