కొడాలి నాని దుమ్ము దులిపేసిన దివ్య వాణి… !

ఏపీలో అధికార వైసీపీ నేత‌ల ఆగ‌డాలు, దౌర్జ‌న్యాల‌పై టీడీపీ నాయ‌కుల‌రాలు దివ్య వాణి తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. త‌మ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌పై వైసీపీ నేత‌లు చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పై ఆమె మండిప‌డ్డారు. లోకేష్‌ను విమర్శించే వారికి ఆవగింజలో అరవయ్యో వంతు అర్హత ఉందా అని ప్ర‌శ్నించిన దివ్య వాణి, లోకేష్ ఏంబీఏ చ‌దివి ప్ర‌పంచ బ్యాంకులో ప‌నిచేశార‌ని.. ఆయ‌న‌కు ఎంతో విజ‌న్‌, క‌ష్ట‌ప‌డే స్వ‌భావం ఉన్నాయని ఆమె చెప్పారు.

 

మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి ఏమండోయ్ కొడాలి నాని గారు పుట్టుక‌తోనే బంగారం స్పూన్‌తో పుట్టిన వ్య‌క్తి లోకేష్‌.. పార్టీలు, కండువాలు మార్చే వ్య‌క్తి కాదు.. వాళ్ల‌కు, వీళ్ల‌కు గ్లాసులు మోసిన వ్య‌క్తి కాదు.. సొంత ప్ర‌యోజ‌నాల కోసం పార్టీలు మారే వ్య‌క్తి కాద‌ని నానిపై సెటైర్ వేశారు. లోకేష్ యూఎస్‌కు వెళితే వ‌చ్చే ఆదాయం 50 ల‌క్ష‌ల డాల‌ర్లు… అయినా త‌న‌ను తాను త‌గ్గించుకుని అంద‌రితో క‌లిసి ప‌ని చేస్తున్నాడ‌ని దివ్య వాణి చెప్పారు.

 

ప్రజలు నమ్మి మీకు పట్టం కట్టారు. మీమాటలు, వికృత చేష్టలతో ఎంతో వేదనను అనుభవిస్తున్నార‌ని… వారిని భ‌య బ్రాంతుల‌కు గురి చేయ‌వ‌ద్ద‌ని దివ్య వాణి హిత‌వు ప‌లికారు. అప్పు చేసి ప‌ప్పు కూడులా ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు.