అబ‌ద్ధంతో అడ్డంగా బుక్ అయిన నాగార్జున‌… ప‌చ్చి ద‌గా.. మోసం..!

బిగ్‌బాస్ 4 రియాల్టీ షో ప్లాప్ అన్న విష‌యం అంద‌రికి తెలుసు. ఏ మాత్రం ఆస‌క్తిక‌రంగా లేదు. అయితే నాగార్జున మాత్రం కోట్ల‌లో ఓట్లు వ‌స్తున్నాయ‌ని డ‌ప్పు కొడుతున్నారు. ఇంకా చెప్పాలంటే దేశంలో కెల్లా నెంబ‌ర్ వ‌న్ జీఈసీ ఛానెల్ స్టార్ మా ఛానెల్ అని నాగ్ స్టార్ మా గురించి తెగ మోసేస్తున్నారు. అస‌లు స్టార్ మా కేవ‌లం తెలుగులో మాత్ర‌మే ఉంది. అలాంటప్పుడు అది దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ జీఈసీ ఛానెల్ ఎలా అవుతుందో ?  తెలియ‌దు.

 

నాగార్జున లాంటి పెద్ద స్టార్ హీరో ఈ మాట అనేట‌ప్పుడు వాస్త‌వాలు చెక్ చేసుకోవాలి. జీఈసీ అంటే జ‌న‌ర‌ల్ ఎంట‌ర్టైన్‌మెంట్ ఛానెల్‌. పైన ఇచ్చిన బార్క్ విశ్లేష‌ణ ప్ర‌కారం స్టార్ గ్రూప్‌న‌కే చెందిన స్టార్ ఉత్స‌వ్ నెంబ‌ర్ వ‌న్ ఛానెల్‌గా ఉంది. రెండోది స్టార్ స్పోర్ట్స్ ( ఐపీఎల్ వ‌ల్ల దానికి ఆ రేటింగ్ ఉంది), మూడోది స్టార్ ప్ల‌స్‌. నాలుగోది స‌న్ టీవీ.

 

 

ఇక నాగ్ నెంబ‌ర్ ప్లేసులో ఉంద‌ని చెప్పిన స్టార్ మా ఏకంగా ఐదో ప్లేసులో ఉంది. ఏదేమైనా బిగ్‌బాస్ త‌స్సుమ‌న్న చ‌ర్చ‌లు జోరుగా ఉంటే నాగ్ ఈ అబ‌ద్ధం చెప్పి త‌న క్రెడిబులిటీ కూడా దెబ్బ‌తినేలా చేసుకున్నాడు. ఇదంతా ప‌చ్చి ద‌గాయే అని నెటిజ‌న్లు ఆడుకుంటున్నారు.