గుణశేఖర్ దర్శకత్వంలో 2003 సంక్రాంతికి వచ్చిన సినిమా ఒక్కడు. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎంఎస్. రాజు నిర్మాతగా వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు అప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న పాత రికార్డులు పాత రేసింది. ఏకంగా 130 కేంద్రాల్లో ఒక్కడు వంద రోజులు ఆడింది. మహేష్‌బాబుకు తిరుగులేని స్టార్ డమ్ ఇచ్చిన ఘనత కూడా ఒక్కడికే సొంతం అయ్యింది. ఈ సినిమాలో భూమిక పాస్ పోస్ట్ కోసం పాస్ పోర్ట్ ఆఫీసర్‌గా ఉన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యంను ఆటపట్టించేందుకు మహేష్ అండ్ ఫ్రెండ్స్ ఓ సీన్లో ఓ ఫోన్ నెంబర్ చెప్పి మనోడిని ఆటాడుకుంటారు.
9848032919 అన్న నెంబర్‌ను పదే పదే చెపుతూ ధర్మవరానికి ఇరిటేట్ తెప్పించడంతో మనోడు వెంటనే పాస్‌పోర్టు ఇచ్చేస్తాడు. ఇంతకు ఈ పాపులర్ నెంబర్ ఎవరిదో తెలుసా.. ఈ నెంబర్ ఎవరిదో కాదు ఈ సినిమా నిర్మాత ఎంఎస్. రాజుదే అట. అయితే ఆ తర్వాత ఈ నెంబర్‌కు లక్షలాది ఫోన్‌కాల్స్ వచ్చాయట. ఏదో సరదాగా రాజు నెంబర్ ఇస్తే ఆ సినిమా హిట్ అయ్యాక వచ్చిన ఫోన్ కాల్స్‌ను తట్టుకోలేక రాజు ఆ నెంబర్‌ను తీసేశారట.
ఈ సీన్ కోసం ముందు ఎవరో ఒకరి నెంబర్ ఇవ్వాలనుకుని చివరకు నిర్మాత రాజు నెంబరే ఇచ్చి ట్విస్ట్ ఇవ్వాలనుకున్నారు. ఏదేమైనా ఈ నెంబర్ 9848032919 అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. ఇక ఆ సినిమా షూటింగ్ టైంలో పలు అవాంతరాలు వచ్చాయి. ఎప్పుడో 2001లో ప్రారంభమైన ఈ సినిమా రెండు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకుని 2003 సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.