ప్రపంచంలో అనేక చోట్ల మల్టీఫ్లెక్స్‌లు ఉన్నాయి. మనదేశంలోనూ అనేక ప్రముఖ నగరాల్లో భారీ మల్టీఫ్లెక్స్‌లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రసాద్ మల్టీఫ్లెక్స్ గురించి అప్పట్లో గొప్పగా చెప్పుకునే వాళ్లం. ఇప్పుడు చాలా మల్టీఫ్లెక్స్‌లు వచ్చాయి. విజయవాడలో ఏడు స్క్రీన్లతో బెంజ్ సర్కిల్లో ట్రెండ్ సెట్ మాల్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో కూడా మల్టీఫ్లెక్స్‌లు వచ్చేస్తున్నాయి. చెన్నైలో ఉన్న మాయాజల్ మల్టీఫ్లెక్స్‌లో ఏకంగా 30 స్క్రీన్లు ఉన్నాయి.
బ్రిటన్ రాజధాని లండన్‌లో అయితే ఏకంగా 127 స్క్రీన్లు ఉన్న మల్టీఫ్లెక్స్ ఉంది. దీని పేరు సినీ వరల్డ్. కరోనా కారణంగా గత ఆరు నెలలుగా ఇది ప్రారంభించలేదు. దీంతో ఈ ఫేమస్ మల్టీఫ్లెక్స్ అయిన సినీ వరల్డ్ భారీ నష్టాల్లో ఉంది. ఇప్పటికే ఈ సినీ వరల్డ్ చైన్ థియేటర్స్ ఏకంగా 350 కోట్ల పౌండ్ల నష్టాల్లో ఉంది. జేమ్స్‌బాండ్, స్టార్ వార్స్‌తో పాటు మరికొన్ని భారీ సినిమాలపై ఆశలు పెట్టుకున్న వీరు ఆ సినిమాలు మళ్లీ వాయిదా పడడంతో ఈ మల్టీఫ్లెక్స్ను తాత్కాలికంగా మూసేయాలని డిసైడ్ అయ్యారు.
దీంతో ఈ సంస్థలో పనిచేస్తోన్న 4500 మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. వరల్డ్ ఫేమస్ మల్టీప్లెక్స్ చైన్ అయిన సినీ వరల్డ్ కు ఇలాంటి పరిస్థితి రావడం బ్రిటన్‌లో పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. ఏదేమైనా కరోనా దెబ్బతో అన్ని రంగాలతో పాటు వినోద పరిశ్రమ కూడా ఘోరంగా దెబ్బతింది. అసలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు ప్రారంభించినా జనాలు వస్తారన్న గ్యారెంటీ కూడా లేదు.