Gossipsబోయ‌పాటి - మ‌హేష్ కాంబినేష‌న్ ఫిక్స్‌... నిర్మాత ఎవ‌రంటే... !

బోయ‌పాటి – మ‌హేష్ కాంబినేష‌న్ ఫిక్స్‌… నిర్మాత ఎవ‌రంటే… !

టాలీవుడ్ అగ్ర‌నిర్మాత దిల్ రాజు ఓ అదిరిపోయే కాంబినేష‌న్‌ను సెట్ చేసినట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం రాజు వ‌కీల్‌సాబ్ చేస్తున్నాడు. ఆ త‌ర్వాత అత‌డి బ్యాన‌ర్లో ఎఫ్ 3 స్టార్ట్ కావాల్సి ఉంది. ఇక రామ్‌చ‌ర‌ణ్ వంశీ పైడిప‌ల్లి క‌థ ఓకే చేస్తే ఆ సినిమా ఉంటుంది. ఇక ఇప్పుడు పెద్ద డైరెక్ట‌ర్ల‌తో భారీ కాంబినేష‌న్లు సెట్ చేయాల‌ని చూస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే దిల్ రాజు బోయ‌పాటికి అడ్వాన్స్ ఇచ్చాడ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.

 

ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా బోయ‌పాటికి రాజు నుంచి అడ్వాన్స్ వెళ్ల‌డంతో పాటు ఓ సినిమాకు అగ్రిమెంట్ అయ్యిందంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న బాలయ్య సినిమా తరువాత బోయపాటి చేయబోయేది దిల్ రాజుకే. హీరో ఎవ‌రు ? అన్న‌దానిపై మ‌హేష్‌బాబు పేరే వినిపిస్తోంది. గ‌తంలో మ‌హేష్‌తో సినిమాకు రాజు ఓకే చేయించుకున్నాడు. అయితే వంశీ పైడిప‌ల్లి క‌థ న‌చ్చ‌క మ‌హేష్ చేయ‌లేదు.

 

ఇక బోయ‌పాటి ద‌గ్గ‌ర గ‌తంలోనే మ‌హేష్ కోసం రాసుకున్న క‌థ ఉంది. అయితే అది ఎప్పుడూ ఎవ‌రి బిజీలో వారు ఉండ‌డ‌తో ప‌ట్టాలు ఎక్క‌డం లేదు. దీంతో ఇప్పుడు బోయ‌పాటి, మ‌హేష్ కాంబో సెట్ చేయాల‌ని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. మ‌రి ఈ క‌థ‌ను మ‌హేష్ ఓకే చేస్తాడో ?  లేదో కాని రాజు మాత్రం గ‌ట్టిగా ట్రై చేస్తున్నాడ‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news