Moviesనాగ‌బాబు వ‌ర్సెస్ న‌వదీప్‌... అదిరింది నుంచి న‌వ‌దీప్ అవుట్ వెన‌క ఇంత...

నాగ‌బాబు వ‌ర్సెస్ న‌వదీప్‌… అదిరింది నుంచి న‌వ‌దీప్ అవుట్ వెన‌క ఇంత జ‌రిగిందా…!

జ‌బ‌ర్ద‌స్త్‌కు పోటీగా జీ తెలుగులో ప్రారంభ‌మైన అదిరింది షో ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి చేసుకుందే కేవ‌లం 25 ఎపిసోడ్లు. అయితే ఇప్ప‌టికే అందులో ఎన్నో మార్పులు, చేర్పులు పెర‌గ‌ని రేటింగ్‌ల‌తో షో కొట్టుమిట్టాడుతోంది. ఈటీవీలో జ‌బ‌ర్ద‌స్త్ ప్రారంభ‌మై ఏడేళ్లు గ‌డుస్తున్నా దాని కాన్పెప్ట్ మార‌లేదు. అయితే అదిరిందిలో మాత్రం 25 వారాల‌కే ఎన్నో మార్పులు, చేర్పులు.. అస‌లు ఏం జ‌రుగుతుందో కూడా అర్థం కావ‌డం లేదు.

 

తాజాగా జ‌డ్జిగా ఉన్న నవదీప్ షో నుంచి త‌ప్పుకున్నాడు. ఇక అదిరింది షో పేరు మార్చేసి బొమ్మ అదిరింది అని పెట్టారు. యాంక‌ర్లుగా ఉన్న ర‌వి, భాను శ్రీల‌ను తీసేసి వారి స్థానంలో శ్రీముఖిని తెచ్చారు. ఇక ఇప్పుడు మ‌రో షాక్‌.. జ‌డ్జిగా ఉన్న న‌వ‌దీప్ త‌ప్పుకున్నాడు. ఇందుకు కార‌ణం నాగ‌బాబుతో న‌వదీప్‌కు విబేధాలు రావ‌డ‌మే అంటున్నారు. న‌వ‌దీప్‌ను త‌ప్పించేందుకే మేనేజ్‌మెంట్ ఇన్ని మార్పులు చేర్పులు చేసిందంటున్నారు.

 

ఇక బొమ్మ అదిరింది పేరుతో షో స్టార్ట్ అయ్యాక ఒక్క ఎపిసోడ్‌కే ఈ షో పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని ఇమిటేట్ చేస్తూ చేసిన స్కిట్ తీవ్ర విమ‌ర్శ‌ల పాలైంది. దీనిపై నాగ‌బాబు మ‌రింత మంట పెట్టేలా స్పందించాడు. మ‌రి ఈ షోలో ఇంకెన్ని మార్పులు వ‌స్తాయో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news