Politicsబ్రేకింగ్‌: విష‌మంగా మంత్రి వెల్లంప‌ల్లి ఆరోగ్యం.. అపోలోలో చికిత్స‌

బ్రేకింగ్‌: విష‌మంగా మంత్రి వెల్లంప‌ల్లి ఆరోగ్యం.. అపోలోలో చికిత్స‌

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయ‌న ప‌రిస్థితి కాస్త విష‌మంగానే ఉంద‌న్న వార్త‌లు అయితే వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉండ‌డంతో ఆయ‌న్ను హుటాహుటీన హైద‌రాబాద్ త‌ర‌లించారు. కొద్ది రోజుల క్రితం మంత్రి వెల్లంప‌ల్లి క‌రోనాకు గుర‌య్యారు. ఆ త‌ర్వాత క‌రోనా నుంచి కోలుకున్నారు.

Vellampalli slams Chandrababu for throwing panel reports in bonfire | Y  This News

మ‌ళ్లీ శాఖా ప‌రంగా రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌ట‌నలు చేస్తున్నారు. ఇంత‌లోనే బుధ‌వారం ఆయ‌న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్టు తెలుస్తోంది. దీంతో కుటుంబ స‌భ్యులు సీఎంవో దృష్టికి తీసుకు వెళ్ల‌గా ఆయ‌న్ను హైద‌రాబాద్ తీసుకు వెళ్లేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసి అక్క‌డ‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వెల్లంప‌ల్లి హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివ‌రాలు రావాల్సి ఉంది.

Vellampalli Srinivas Mother Passes Away After Prolonged Illness - Sakshi

Latest news