Newsవైర‌ల్ వీడియో: కొండ చిలువ‌ను మింగిన చిరుత‌

వైర‌ల్ వీడియో: కొండ చిలువ‌ను మింగిన చిరుత‌

ప‌రుగులు పెట్ట‌డంలో చిరుత పులిని మించింది ఉండ‌ద‌ని మ‌నం పోలిక పెడుతుంటాం.. దాని ఎన‌ర్జీ ఉన్నంత వ‌ర‌కు అది ట్రైన్ కంటే వేగంగా ప‌రిగెత్తుతుంది. ప‌రుగులు పెట్ట‌డంలోనే కాదు.. వేటాడంలో కూడా చిరుత‌కు ఏదీ సాటి రాదు. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన కొండ చిలువ‌తో పోటీ ప‌డ‌డం అంటే ఏ జంతువుకు అయినా క‌ష్ట‌మే. అలాంటి కొండ చిలువ‌ను చిరుత సులువుగా చంపేసింది. చాలా పొడ‌వుగా ఉన్న ఈ కొండ చిలువ‌తో త‌ల‌ను చిరుత మింగేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

చిరుత అక‌స్మాత్తుగా దాడి చేయ‌డంతో షాక్ అయిన కొండ చిలువ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఆ త‌ర్వాత చిరుత మ‌రోసారి త‌న ప‌ట్టు నిలుపుకుని కొండ చిలువ‌పై దాడి చేసి త‌ల నోట్లో పెట్టేసుకుంది. చ‌చ్చిపోయిన కొండ చిలువ‌ను నోటితో క‌ర‌చుకుని వెళుతోన్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు మనుషులనో లేదా జంతువులను మింగిన కొండ చిలువను చూశాం గానీ ఇప్పుడు చిరుతే పొడ‌వైన కొండ చిలువ‌ను నోట్లో పెట్టుకుని వెళుతుండ‌డంతో నెటిజ‌న్లు ఇది మామూలు చిరుత కాద‌ని కామెంట్లు కురిపిస్తున్నారు.

https://twitter.com/i/status/1315518047071858688

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news