దేశంలో పెద్ద రాష్ట్రం అయిన యూపీలో మహిళల మాన ప్రాణాలకు అస్సలు రక్షణ లేకుండా పోతోంది. ప్రతి పది రోజులకు అక్కడ మహిళలపై ఘోరమైన అకృత్యాలు బయటకు వస్తున్నాయి. ఇక అత్యాచారాలు, లైంగీక దోపిడీలు అయితే ప్రతి రోజు సర్వ సాధారణం అయిపోయాయి. తాజాగా యూపీలో మరో దారుణ అత్యాచార ఘటన జరిగింది. ఓ దళిత యువతిపై ఓ యువకుడు ఏకంగా యేడాదిన్నర నుంచి అత్యాచారం చేస్తున్నాడన్న విషయం బయటకు వచ్చింది.
బల్లియా నగరంలోని 17 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి గత ఏడాదిన్నర కాలంగా అత్యాచారానికి ఒడిగడుతున్నాడని పోలీసులు ఆదివారం తెలిపారు. నిందితుడు బాధితురాలి ఇంటి సమీపంలోనే ఉండడంతో ఆ యువతిని లొంగదీసుకుని అత్యాచారం చేస్తున్నాడు. యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 20 ఏళ్ల యువకుడు అయిన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తన కుమార్తెపై సంవత్సన్నర నుండి సదరు వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడని తల్లి ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. నిందితుడిపై పలు సెక్షన్‌లతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. యువతిని వైద్య పరీక్షలకు పంపారు.