Moviesఆర్ ఆర్ ఆర్ మ‌రో పోస్ట‌ర్‌... క‌థ లైన్ ఏంటో చెప్పేశారు...

ఆర్ ఆర్ ఆర్ మ‌రో పోస్ట‌ర్‌… క‌థ లైన్ ఏంటో చెప్పేశారు…

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి మ‌రో పోస్ట‌ర్ రిలీజ్ అయ్యింది. రు. 400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. క‌రోనా కార‌ణంగా ఏడు నెల‌ల గ్యాప్ త‌ర్వాత తిరిగి ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మ‌రో పోస్ట‌ర్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు.

 

 

ఈ పోస్టర్‌లో వెనుక అశోక ధర్మ చక్రం, ముందు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ చేతులు కలిపినట్లుగా ఉంది.  ఈ పోస్ట‌ర్ రిలీజ్ చేశాక ఇది దేశ‌భ‌క్తి సినిమా కాద‌ని.. ఫిక్ష‌న‌ల్ మూవీయే అని మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఇది దేశ‌భ‌క్తి మూవీ అని జ‌రుగుతోన్న ప్ర‌చారానికి మ‌రోసారి సినిమా యూనిట్ చెక్ పెట్టింది.

 

ఇక ఆర్ ఆర్ ఆర్‌లో ఎన్టీఆర్ కొమ‌రం భీం టీజ‌ర్‌ను ఈ నెల 22న రిలీజ్ చేయ‌నున్నారు. ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్‌కి జోడీగా హిందీ నటి ఆలియా భట్‌ కనిపించనున్నారు. శ్రియ, అజయ్‌ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news