ఆ వైసీపీ ఎమ్మెల్యే కక్కుర్తిపై ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. సదరు ఎమ్మెల్యే తన అనుచరులతో కొద్ది రోజులుగా నియోజకవర్గంలో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న టాక్ వచ్చేసింది. ప్రకాశం జిల్లాలో ఓ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు జిల్లాలోనే తీవ్ర చర్చనీయాంశమమైంది. ఆ ఎమ్మెల్యే కక్కుర్తి చూసి ఎందుకు గెలిపించాంరా ? బాబు అని తలలు పట్టుకుంటున్నారట.
ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల ప్రపంచంలో ప్రజలు అందరూ చేతిలో చిల్లిగవ్వ లేక విలవిల్లాడుతున్నారు. ఈ టైంలో ఎమ్మెల్యే & గ్యాంగ్ ఏది దొరికితే అదే దోచేస్తున్నారట. వాస్తవానికి ఆయన ఎన్నికల్లో గెలిచిన రెండో నెల నుంచే చందా దందా మొదలెట్టేశారన్న టాక్ వచ్చింది. అప్పట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. మొన్న శ్రావణ మాసంలో బంగారం షాపులు బతికి బట్టకట్టాలంటే షాపులు ఓపెన్ చేసుకోవాలంటే మొత్తం వ్యాపారులు అందరూ కలిసి 3-4 కోట్లు కప్పం కట్టాలని అడిగాడట. ఆ బంగారం వ్యాపారులు మేం ఇవ్వం అని చెపితే ఆ షాపులు కూడా తెరచుకోకుండా చేశాడట సదరు ఎమ్మెల్యే.
ఇక ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అనుచరులు నియోజకవర్గంలో చేతి వృత్తుల వారిని టార్గెట్ చేశారట. ముఖ్యంగా బార్బర్ షాపుల వాళ్లను కూడా వదలకుండా షాప్‌నకు ఇంత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఎమ్మెల్యే అనుచరుల చేతివాటంతో మంగళపని వారు అవాక్కైనట్టు తెలుస్తోంది. ఇది ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతుందా ? అని నియోజకవర్గ జనాలు దీనిపై చర్చించుకుంటున్నా ఎమ్మెల్యేకు తెలియకుండా ఎలా ఉంటుందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. తప్పు ఎవరు చేసినా ఈ సంఘటన తర్వాత ఎమ్మెల్యేపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయన తీరు మార్చుకోకపోతే ఇదే ఆయనకు ఎమ్మెల్యేగా చివరి గెలుపు అవుతుందని నియోజకవర్గ జనాలు వార్నింగ్ ఇస్తున్నారు.