Moviesబిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్స్ ఆ ఇద్ద‌రే... ర‌చ్చ షురూ...!

బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్స్ ఆ ఇద్ద‌రే… ర‌చ్చ షురూ…!

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 4 తొలి ఎపిసోడ్‌తోనే కావాల్సినంత ర‌చ్చ షురూ చేసింది. మొత్తం 16 మంది కంటెస్టెంట్ల‌ను నాగార్జున హౌస్‌లోకి పంపారు. వీరిలో ఇద్ద‌రు కంటెస్టెంట్ల‌ను సీక్రెట్ రూంలోకి వెళ్లారు. వీరు హౌస్‌లోకి ఎప్పుడు వెళ‌తారు ? అన్న‌ది బిగ్‌బాస్ డిసైడ్ చేస్తాడు. ఇక బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ అలా ప్రారంభ‌మైందో లేదో వెంట‌నే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ర‌చ్చ అప్పుడే షురూ అయ్యింది. అప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి జ‌నాలు చ‌ర్చించేసుకుంటున్నారు. నాలుగో సీజ‌న్లో ఇద్ద‌రు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోప‌ల‌కు పంపుతార‌ని తెలుస్తోంది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ రోజుల్లో సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ శశికుమార్ పంపన మరియు జబర్దస్త్ లో మంచి ఫేమస్ ముక్కు అవినాష్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్లుగా ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక వీరిద్ద‌రు హౌస్‌లో ఉంటే ఖ‌చ్చితంగా కావాల్సినంత కామెడీ ఉంటుంద‌నే బిగ్‌బాస్ అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. ఈ సారి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు చేసే టాస్క్‌లు ప్ర‌ధానంగా యూత్‌ను టార్గెట్ చేసేలా ఉంటాయంటున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news