యూట్యూబ్ టిక్‌టాక్ వ‌చ్చేసింది.. ఫీచ‌ర్స్ ఇవే

యూట్యూబ్ టిక్‌టాక్ వ‌చ్చేసింది.. ఫీచ‌ర్స్ ఇవే

ప్ర‌ముఖ చైనా షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌ద్ర‌తా కార‌ణాల నేప‌థ్యంలో అనేక దేశాలు బ్యాన్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే భార‌త్ ఈ యాప్‌ను బ్యాన్ చేయ‌గా, అమెరికా సైతం సెప్టెంబ‌ర్ 20లోగా టిక్‌టాక్ అమెరికా బిజినెస్‌ను ఏదైనా అమెరికా సంస్థ‌కు అమ్మ‌క‌పోతే బ్యాన్ చేస్తామ‌ని చైనాకు వార్నింగ్ ఇచ్చేసింది. ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌తో టిక్‌టాక్ త‌న అమెరికా బిజినెస్‌ను మైక్రోసాఫ్ట్‌కు అమ్మేందుకు ప్ర‌య‌త్నాలు చేసినా ఇప్పుడు ఆ డీల్ క్యాన్సిల్ అయ్యింది. ఇక ఇప్పుడు ఒరాకిల్ అమెరికా టిక్‌టాక్ మార్కెట్ సొంతం చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంది.

 

ఇక టిక్‌టాక్‌కు పోటీగా ఎన్నో కొత్త అప్లికేషన్ లు వస్తున్నాయి. ఇప్పటికే చింగారి, ఇంస్టాగ్రామ్ రీల్స్ అప్లికేష‌న్లు నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ వీడియో షేరింగ్ యాప్ యూట్యూబ్ సైతం షార్ట్స్ పేరుతో టిక్‌టాక్ త‌ర‌హాలో ఓ వీడియో షేరింగ్ యాప్ అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. యూట్యూబ్ ప్రొడ‌క్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ జాప్స్ ఈ విష‌యం వెల్ల‌డించారు.

 

ఈ షార్ట్ మొబైల్ యాప్‌లో 15 సెకన్ల నిడివిలో లఘు చిత్రాలు, ఆకర్షణీయమైన వీడియోలను తీసుకోవ‌చ్చు. ఈ ఆప్ ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులోకి వ‌చ్చింది. త్వరలోనే ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకు వ‌స్తారు. ఈ యాప్‌లో స్పీడ్ కంట్రోల్స్‌, హ్యాండ్స్ ఫ్రీ రికార్డ్ టైమ‌ర్‌, కౌంట్‌డౌన్ ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news