ప‌వ‌న్ – క్రిష్ ప్రాజెక్టు రేసులో లేటెస్ట్ టైటిల్‌… క్రిష్ ఏం ట్విస్ట్ బాబు..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ – క్రిష్ కాంబినేష‌న్లో ప‌వ‌న్ కెరీర్‌లో 27వ సినిమాగా తెర‌కెక్కుతోన్న సినిమాకు ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల టైటిల్స్ ప‌రిశీల‌న‌లోకి వచ్చాయి. బందిపోటు – విరూపాక్ష – గజదొంగ – లేటెస్ట్ గా ఓం శివమ్ పేర్లు రేస్ లోకి వచ్చాయి. ఈ టైటిల్స్ గురించి ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గానే ఇప్పుడు మ‌రో టైటిల్ రేసులోకి వ‌చ్చింది.

 

ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తోన్న రైట‌ర్ బుర్రా సాయిమాధ‌వ్ కొన్ని అద్భుత‌మైన వ్యాఖ్య‌ల‌తో అంత‌ర్వాహిని పేరిట తెలిపారు. అయితే అదే హెడ్‌లైన్లో క్రిష్ కూడా హైలెట్ చేయ‌డం ఆస‌క్తిగా మారింది. క్రిష్ ఇచ్చిన ట్విస్ట్‌తో ఈ సినిమాకు ఇదే టైటిల్ పెట్టారా ? అన్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. మరి క్రిష్ ఏ టైటిల్ ను ఫిక్స్ చేసారో చూడాలి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా న‌టిస్తోంద‌ని తెలుస్తోంది.

 

 

ప‌వ‌న్ ప్ర‌స్తుతం వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న వ‌కీల్‌సాబ్ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ఈ సినిమా త‌ర్వాత హ‌రీష్‌శంక‌ర్‌, సురేంద‌ర్‌రెడ్డి, త్రివిక్ర‌మ్ సినిమాలు లైన్లో ఉన్నాయి.

Leave a comment