అనిల్ రావిపూడి – బాల‌య్య సినిమా డీటైల్స్‌

ఈ త‌రం జ‌న‌రేష‌న్ ద‌ర్శ‌కుల్లో అనిల్ రావిపూడి కామెడీని పండించ‌డంలో త‌న‌కు తానే ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. త‌న‌దైన మార్క్ కామెడీ, పంచ్‌లు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. అందుకే అనిల్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సినిమాలు చేస్తే ఐదు మంచి హిట్ కొట్టాయి. ఈ సంక్రాంతికి సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుతో అనిల్ చేసిన స‌రిలేరు నీకెవ్వ‌రు త్రివిక్ర‌మ్ అల వైకుంఠ‌పురంలో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను తట్టుకుని మ‌రీ హిట్ కొట్టింది.

 

దీంతో ఇప్పుడు ప‌లువురు హీరోలు అనిల్‌తో సినిమా చేసేందుకు వెయిటింగ్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం అనిల్ వెంకీ – వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన వెంట‌నే అనిల్ రావిపూడి తన తరువాత సినిమాని బాలయ్యతో చేయబోతున్నాడట‌. ఇప్ప‌టికే అనిల్ – బాల‌య్య మ‌ధ్య సంప్ర‌దింపులు కూడా పూర్త‌య్యాయ‌ని తెలుస్తోంది.

 

గ‌తంలోనే అనిల్ బాల‌య్య‌తో రామారావు గారు టైటిల్‌తో సినిమా చేయాల‌నుకున్నా అప్ప‌ట్లో బాల‌య్య బిజీ షెడ్యూల్స్ వ‌ల్ల కుద‌ర్లేదు. ఇక ఇప్పుడు అనిల్ బాల‌య్య‌తో చేసే సినిమా కంప్లీట్‌గా ఎంట‌ర్టైన్‌మెంట్ డోస్‌తో న‌డుస్తుంద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు అనిల్ చేసిన సినిమాలు అన్ని ప‌క్కా ఫ‌న్‌తో ఉన్న‌వే. మ‌రి బాల‌య్య లాంటి సీరియ‌స్ హీరోతో అనిల్ ఫ‌న్ ఎలా జ‌న‌రేట్ చేయించి మెప్పిస్తాడో ?  చూడాలి.

Leave a comment