రానా సినిమాలో న‌టిస్తోన్న ఆ సీనియ‌ర్ హీరోయిన్‌కు క‌రోనా పాజిటివ్‌

టాలీవుడ్ హీరో ద‌గ్గుబాటి రానా ఈ యేడాది పెళ్లి చేసుకుని ఎంచ‌క్కా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే మ‌నోడు న‌టిస్తోన్న భారీ ప్రాజెక్టు విరాట‌ప‌ర్వం ఎప్ప‌టి నుంచో ఆల‌స్యం అవుతోంది. ఇక ఇప్పుడు క‌రోనా వ‌ల్ల ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా ప‌డింది. ఇదిలా ఉంటే ఈ పీరియాడిక్ డ్రామాలో సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌. ఇక మావోయిస్టుగా మ‌రో హీరోయిన్ ప్రియ‌మ‌ణితో పాటు బాలీవుడ్ సీనియ‌ర్ న‌టీమ‌ణి జ‌రీనా వాహాబ్ కూడా న‌టిస్తోంది. అయితే ఇప్పుడు ఆమెకు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింద‌ట‌.

 

 

ఆమె క‌రోనా ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతుండ‌డంతో పాటు ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ కూడా త‌గ్గ‌డంతో ఆమెను ప్ర‌ముఖ హాస్ప‌ట‌ల్లో వైద్యం కోసం జాయిన్ చేసినట్టు ఆమె భ‌ర్త ఆదిత్య పంచోలి చెప్పారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని తెలుస్తోంది. జ‌రీనాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు, జ్వరం సహా ఇతర లక్షణాలు ఉన్నాయట.

Leave a comment