పైకి ఆయుర్వేదం… లోప‌ల వ్య‌భిచారం… కొత్త దందాలో సంచ‌ల‌న నిజాలు

పైన బోర్డు చూస్తే ఇక్క‌డ ఆయుర్వేద వైద్యం చేయ‌బ‌డును అని ఉంటుంది. లోప‌ల‌కు వెళ్లాక అక్క‌డ జ‌రిగేది అంతా హై క్లాస్ వ్య‌భిచారం. ఓ వైపు దేశంలో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోన్నా కూడా వ్య‌భిచార గృహాలు న‌డుస్తూనే ఉన్నాయి. ఈ వేశ్య‌ల ద్వారా క‌రోనా ఆగ‌డం లేదు. తాజాగా మ‌హారాష్ట్ర‌లోని పూణేలో జ‌రిగిన సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. పైకి ఆయుర్వేద క్లీనిక్ పేరుతో న‌డుపుతోన్న ఓ ఇంట్లో లోప‌ల హై క్లాస్ వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నారు.

 

 

ఈ స‌మాచారం అందుకున్న పోలీసులు దాడులు జ‌రిపి ముగ్గురు యువతులను, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ సెక్స్ రాకెట్ ను నడుపుతోన్న దామాజీ అలియాస్ కరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేద యువ‌తులు, ఆర్థికంగా క‌ష్టాల్లో ఉన్న యువ‌తుల‌ను టార్గెట్‌గా చేసుకుని వారిని ఈ దందాలోకి దింపుతున్నార‌ని పోలీసులు గుర్తించారు.

Leave a comment