బిగ్‌బాస్ 4.. ఆ కంటెస్టెంట్‌ను చూసి భ‌య‌ప‌డుత‌న్నారా…!

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ షో బిగ్‌బాస్ 4 మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లోనే గంగ‌వ్వ స్పెష‌ల్ కంటెస్టెంట్‌గా ఉంది. గంగ‌వ్వ‌కు ఇప్పుడిప్పుడే ఆట అర్థ‌మ‌వుతోంది. బ‌య‌ట కూడా ఆమెకు విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. తొలి రెండు వారాలు ఆమె ఎలిమినేన్లో ఉన్నా ఏకంగా 50 శాతం ఓటింగ్‌తో సులువుగానే ఎలిమినేష‌న్ నుంచి బ‌య‌ట ప‌డింది.

 

అయితే ఇప్పుడు గంగ‌వ్వ విష‌యంలో మిగిలిన కంటెస్టెంట్లు భ‌య‌ప‌డుతున్నట్టే క‌నిపిస్తోంది. ఆమెను విమ‌ర్శించినా.. ఆమెను ఎలిమినేష‌న్ చేసినా బ‌య‌ట ఉన్న ఆమె ఫ్యాన్స్‌కు ఆ కంటెస్టెంట్లు ఖ‌చ్చితంగా టార్గెట్ అవుతార‌న్న భ‌యం చాలా మందిలో ఉంద‌న్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. బిగ్‌బాస్ విష‌యంలో ఇప్ప‌టికే మిగిలిన కంటెస్టెంట్ల మ‌ధ్య గ్యాప్‌లు, మాట‌ల యుద్ధాలు, అపోహలు, అల‌క‌లు మొద‌ల‌య్యాయి.

 

అయితే గంగ‌వ్వ విష‌యంలో మాత్రం ఎవ్వ‌రూ ఆమె ఆట‌కు ఫిట్ కాద‌ని లేదా ఆమెకు వ్య‌తిరేకంగా ఎక్క‌డా మాట్లాడ‌డం కాని చేయ‌డం లేదు. దీనికి కార‌ణం బ‌య‌ట ఆమెకు ఉన్న క్రేజ్ అంద‌రికి తెలుస‌నే అంటున్నారు. ఏదేమైనా గంగ‌వ్వ టాప్-5వ‌ర‌కు వెళుతుంద‌న్న చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి.

Leave a comment