ఆచార్య‌పై డిజ‌ప్పాయింట్ అప్‌డేట్‌… ఫ్యాన్స్‌కు ఇది నిజంగా బ్యాడ్ న్యూసే..!

మెగాస్టార్ చిరంజీవి సైరా లాంటి భారీ బ‌డ్జెట్ సినిమా త‌ర్వాత న‌టిస్తోన్న సినిమా ఆచార్య‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో చిరు త‌న‌యుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వాస్త‌వంగా ఈ సినిమా ఈ స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కావాల్సి ఉంది. లాక్‌డౌన్ వ‌ల్ల షూటింగ్ వాయిదా ప‌డ‌గా ద‌స‌రాకు అనుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చే సంక్రాంతికి అన్నారు.

 

ఇక ఇప్పుడు మ‌రో డిజప్పాయింట్ న్యూస్ ఈ సినిమా గురించి ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం కోవిడ్‌-19 ఎఫెక్ట్ వ‌ల్ల ఈ సినిమా షూటింగ్‌ను మ‌రో రెండు నెల‌ల పాటు వాయిదా వేశార‌ట‌. చిరు వ‌య‌స్సు 65 ఏళ్లు కావ‌డంతో ఇప్పట్లో చిరు షూటింగ్లో పాల్గొనేందుకు సుముఖంగా లేడ‌ని తెలుస్తోంది. అందుకే మ‌రో రెండు నెల‌ల‌కు పైగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాదంటున్నారు.

 

 

ఈ లెక్క‌న చూస్తే వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో ఏప్రిల్ మూడో వారంలో ఆచార్య‌ను రిలీజ్ చేయ‌డం కూడా క‌ష్ట‌మే అనిపిస్తోంది. ఇక మెగాస్టార్ సినిమా కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తోన్న ఫ్యాన్స్‌కు ఇది పెద్ద షాకే అనుకోవాలి.

Leave a comment