ఈ సారి సంక్రాంతికి ఈ టాప్ హీరోల పోటీ… గెలిచి నిలిచేదెవ‌రో…!

ఈ సారి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద మామూలు ఫైట్ ఉండేలా లేదు. గ‌త నాలుగైదేళ్లుగా సంక్రాంతికి వ‌స్తోన్న సినిమాలు అన్ని ఒక‌దానిని మించి మ‌రొక‌టి హిట్ అవుతున్నాయి. ఇక ఈ సంక్రాంతికి కూడా చాలా సినిమాలు రేసులో ఉండ‌డంతో సంక్రాంతి బాక్సాఫీస్ స‌మ‌రం హీటెత్తిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పైగా లాక్‌డౌన్ నేప‌థ్యంలో గ‌త ఐదారు నెల‌లుగా థియేట‌ర్లు ఓపెన్ కాక రిలీజ్‌లు ఆగిపోయాయి. ఇక మ‌రో రెండు మూడు నెల‌ల‌కు అయినా థియేట‌ర్లు ఓపెన్ అవుతాయా ? అన్న సందేహాలు ఉన్నాయి.

 

ఈ క్ర‌మంలోనే చాలా సినిమాలు సంక్రాంతిపైనే క‌న్నేశాయి. మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న క్రాక్ – నాగ చైతన్య, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న ల‌వ్ స్టోరీతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచుల – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్‌నే సంక్రాంతిని లాక్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ర‌వితేజ‌, ప‌వ‌న్‌తో పాటు అక్కినేని అన్న‌ద‌మ్ములు అఖిల్‌, చైతు మ‌ధ్య పోటీ అంటే థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్ల‌డంతో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసుల వ‌ర్షం కురుస్తుంది.

 

ఇక ఈ నాలుగు సినిమాల‌తో పాటు మ‌రో భారీ సినిమా కేజీఎఫ్ 2 సైతం సంక్రాంతి రేసులోనే ఉందంటున్నారు. మ‌రో నాలుగు నెల‌ల టైం ఉండ‌డంతో సంక్రాంతి రేసులో ఇంకెన్ని సినిమాలు వ‌స్తాయో ?  చూడాలి.

Leave a comment