కీర్తికి మ‌హేష్ నో… బాలీవుడ్ భామ‌తోనే రొమాన్స్‌కు రెడీ…!

ఈ సంక్రాంతికి వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని టాక్‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని.. ఆమె పేరు దాదాపు ఖ‌రారైంద‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

 

అయితే ఇప్పుడు కీర్తి సురేష్‌కు బ‌దులుగా మ‌రో బాలీవుడ్ భామ పేరు మ‌హేష్ ప‌క్క‌న వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇప్ప‌టికే బాలీవుడ్ స్టార్లు అయిన విద్యాబాల‌న్, అనిల్ క‌పూర్ న‌టిస్తున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్కిస్తుండడంతో హీరోయిన్‌ను కూడా బాలీవుడ్ భామ‌నే తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. మ‌రి మ‌హేష్ ప‌క్క‌న న‌టించే ఆ ల‌క్కీ ఛాన్స్ ఏ బాలీవుడ్ భామ‌కు ద‌క్కుతుందో ?  చూడాలి.

 

ఇక న‌వంబ‌ర్ నుంచి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించ‌నున్నారు. తొలి షెడ్యూల్‌ను అమెరికాలోని డెట్రాయిట్‌లో ప్లాన్ చేస్తున్నారు. అక్క‌డ 45 రోజుల షెడ్యూల్ చేశాక‌.. తిరిగి ఇండియాకు వ‌చ్చి ఇక్క‌డ షూటింగ్ చేస్తారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Leave a comment