హీరోయిన్ లైంగీక వేధింపుల ఆరోప‌ణ‌ల‌పై టాప్ డైరెక్ట‌ర్ కౌంట‌ర్‌..

డ్ర‌గ్స్ కేసులు, మీ టు ఉద్య‌మాలు, లైంగీక వేధింపుల ఆరోప‌ణ‌లు బాలీవుడ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా ఈ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తున్నాయి. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వా బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా బాలీవుడ్ టాప్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్‌పై సైతం హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్ లైంగీక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

 

తెలుగులో ఎన్టీఆర్ ప‌క్క‌న ఊస‌ర‌వెల్లి సినిమాలో చేసిన పాయ‌ల్ మాట్లాడుతూ పాయ‌ల్ త‌న‌ను హీరోయిన్ ఛాన్స్ ఇస్తానంటూ లైంగీకంగా వేధించాడ‌ని ఆరోపించింది. దీనిపై అనురాగ్ స్పందించాడు. సినిమా ఇండ‌స్ట్రీలో ఉండ‌డంతో తాను చాలా రోజుల నుంచి ఆడ‌వాళ్ల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాన‌ని.. తాను ఆడ‌వాళ్ల‌కు ఎప్పుడూ గౌర‌వం ఇస్తానని చెప్పారు.

 

ఆధారాలు లేని ఆరోప‌ణ‌ల‌ను తాను ప‌ట్టించుకోన‌ని అనురాగ్ చెప్పాడు. ఇదంతా ఓ మ‌హిళ మ‌రో మ‌హిళ‌తో చేయిస్తోన్న నాట‌కంగా ఈ ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న అభివ‌ర్ణించాడు.

Leave a comment