బ్రేకింగ్‌: చెన్నై సూప‌ర్‌కింగ్స్‌కు బిగ్ షాక్‌… గాయంతో కీల‌క ఆట‌గాడు అవుట్‌

ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై 5 వికెట్ల‌తో గెలిచి శుభారంభం చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు తొలి మ్యాచ్‌లో ముగిసిన వెంట‌నే ఎదురు దెబ్బ త‌గిలింది. గాయం కార‌ణంగా ఆ జ‌ట్టు కీల‌క ఆట‌గాడు డ్వేన్ బ్రావో త‌దుప‌రి రెండు మ్యాచ్‌ల‌కు దూరం కానున్నాడు. ఈ విష‌యాన్ని చెన్నై కోచ్ స్టిఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. దీనిపై ఫ్లెమింగ్ మాట్లాడుతూ బ్రావో లేక‌పోవ‌డంతో సామ్ కుర్రాన్ వ‌చ్చి మంచి ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడ‌ని చెప్పాడు.

 

ఇక ముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల‌తో విజ‌యం సాధించింది. ఆరు ప‌రుగుల‌కే రెండు వికెట్లు ప‌డిన టైంలో దిగిన అంబ‌టి రాయుడు 71, డూప్లెసెస్ 58 నాటౌట్‌.. మూడో వికెట్‌కు 115 ప‌రుగులు చేయ‌డంతో చెన్నై గెలిచింది. చివ‌ర్లో ఆల్‌రౌండర్‌ సామ్‌ కరాన్‌ ఆరు బంతుల్లో రెండు సిక్స్‌లు, 1 సిక్స్‌తో బ్యాట్‌ ఝుళిపించాడు.

Leave a comment