డ్ర‌గ్స్ మాఫియా… సంజ‌న పేరే మార్చేసుకుందిగా..!

శాండ‌ల్‌వుడ్ డ్ర‌గ్ మాఫియాలో రోజుకో కొత్త విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన సంజ‌న గల్రానీ ఆస్తులు, ఆమె వ్య‌వ‌హారాలు చూస్తోన్న వారికి మ‌తిపోతోంది. ఆమె త‌న ప్రేమికుడు అజీజ్ ప్రోత్సాహంతో ల‌వ్ జీహాద్‌లో భాగంగా మతంతో పాటు త‌న పేరు కూడా మార్చుకుంద‌ని ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 2018లోనే సంజ‌న హిందూమ‌తం మారిపోయింద‌ని.. ఆమె త‌న పేరును మ‌హిరాగా మార్చుకుంద‌ని ఆయ‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

 

అయితే బెంగ‌ళూరు పోలీసులు కోర్టుకు ఆమెపై స‌మ‌ర్పించిన నివేదిక‌లో మాత్రం ఆమె పేరు మ‌హిరా అని ఎక్క‌డా లేదు.. సంజ‌న అని మాత్ర‌మే పేర్కొన్నారు. ఇక హీరోయిన్ సంజ‌న‌, ప్ర‌ముఖ వైద్యుడు అజీజ్ ఎన్నో యేళ్లుగా ప్రేమించుకుంటున్నార‌న్న వార్త‌లు శాండ‌ల్‌వుడ్‌లో ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. ఇప్ప‌టికే వారి ఎంగేజ్మెంట్ ఫొటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కరోనా లాక్ డౌన్ తో పెళ్లి ఆగిపోయిందంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై అటు సంజన కానీ.. ఇటు డాక్టర్ అజీజ్ కానీ అధికారికంగా స్పందించలేదు.

Leave a comment