బిగ్‌బాస్ 4.. ఈ వారం ఎలిమినేష‌న్ ఎవ‌రో తెలిసిపోయింది…!

బిగ్‌బాస్ 4వ సీజ‌న్ మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి రెండు వారాలు సేఫ్ గేమ్ ఆడిన కంటెస్టెంట్ల మ‌ధ్య బిగ్‌బాస్ ముసుగు తొల‌గించ‌డంతో పాటు వారిలో వారికి కుంపట్లు బాగానే రాజేశాడు. ఇక మూడో వారం ఎలిమినేష‌న్లో క‌రాటే క‌ల్యాణి డైరెక్టు నామినేష‌న్‌తో యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి, కెప్టెన్ నోయ‌ల్ విచ‌క్ష‌ణ అధికారంతో లాస్య నామినేట్ అయ్యారు. ఇక కంటెస్టెంట్ల‌కు ఫోటోల‌ను మంట‌ల్లో వేసి నామినేట్ చేసే ఛాన్స్ ఇవ్వ‌డంతో ఎక్కువ మంది కుమార్ సాయి, అరియానా ఫొటోలు మంట‌ల్లో వేశారు.

 

నోయల్ కెప్టెన్ అవ్వడం వల్ల ఎలిమినేషన్ నుండి ఉపశమనం పొందాడు. ఇక ఈ వారం ఎలిమినేష‌న్లో ఉన్న వారిలో దేవి – లాస్య – కుమార్ సాయి – మోనాల్ – మెహబూబ్ – అరియానా – హారిక ఉన్నారు. వీరిలో లాస్య మరియు అరియానాలు మొదటి సారి ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేష‌న్లో కుమార్ సాయి బ‌య‌ట‌కు వెళ్లిపోయే ఛాన్సులు ఉన్నాయి.

 

 

కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఏమాత్రం ఆకట్టుకోలేక పోతున్నాడు అన్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. అస‌లు ఈ వార‌మే అత‌డు వెళ్లిపోతాడ‌నుకున్నా క‌రాటే క‌ల్యాణి అవుట్ అయ్యింది. ఇక ఈ వారంలో కుమార్ సాయికి షాక్ త‌ప్ప‌దనే అంటున్నారు.

Leave a comment