రాజ‌మౌళికే అదిరే ఆఫ‌ర్ ఇచ్చిన క్రేజీ హీరోయిన్‌… !

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్ కాంబోలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆలియాభ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నుంది. అయితే సినిమా షూటింగ్ పలుసార్లు వాయిదా ప‌డ‌డంతో పాటు సుశాంత్‌సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత ఆలియా కుటుంబాన్ని ఎక్కువ మంది టార్గెట్ చేస్తుండ‌డంతో ఆలియా ఆర్ ఆర్ ఆర్‌లో ఉంటుందా ? అన్న సందేహాలు కూడా చాలా మందికి క‌లిగాయి.

అయితే తాజా స‌మ‌చారం ప్ర‌కారం ఆలియా రాజ‌మౌళికి అదిరిపోయే ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. లాక్‌డౌన్ వల్ల నిలిచిన ఈ సినిమా షూటింగ్ న‌వంబ‌ర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అలియా భట్ జక్కన్నకు షూట్ కోసం రెండు నెల‌ల పాటు బ‌ల్క్ డేట్స్ ఇచ్చింద‌ట‌. న‌వంబ‌ర్‌, డిసెంబ‌ర్ రెండు నెల‌ల డేట్లు అన్ని మీ ఇష్టం వ‌చ్చిన‌ట్టు వినియోగించుకోవ‌చ్చ‌ని రాజ‌మౌళికి ఆలియా సూచించింద‌ట‌.

 

ఆ త‌ర్వాత ఆమెకు ప‌లు బిజి షెడ్యూల్స్ ఉండడంతో ఆర్ ఆర్ ఆర్‌ షూటింగ్ ఎప్పుడు మొదలైనా..రాజమౌళి మొదటగా అలియాభట్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేస్తాడని తెలుస్తోంది.

Leave a comment