వైశాలి సినిమా చూస్తున్నంత సేపు హీరోయిన్ క్యారెక్టర్ తలచుకుని బాధపడుతూనే ఉంటాం. హీరోయిన్ పడే బాధలు తెరపై చూస్తుంటే మనకు కూడా కన్నీళ్లు ఆగవు. వైశాలి ఎంత మంచి భార్య అయినా అనుమానంతో భర్త చంపేయడం.. ఆమె దెయ్యంగా మారి తిరిగి వచ్చి పగతీర్చుకోవడం జరుగుతుంది. ఈ ఒక్క సినిమాతో ఆమె అందరిని ఎలా ఏడిపించిందో అంతే పేరు కూడా ఆమెకు వచ్చింది. ఆమె ఎవరో కాదు సింధు మీనన్.
తెలుగులో భద్రాచలం, వైశాలి, కాజల్ చందమామ సినిమాలో ఆమె చెల్లిగా నటించి మెప్పించి ఇక్కడ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మళయాళీ కుటుంబానికి చెందిన సింధుకు చిన్నప్పటి నుంచే భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది. అలా భరతనాట్యం కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడే ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. 1999లోనే ఆమె కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఆమె తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి చాలా సమయమే పట్టింది.
సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ఈ భామ 2010లో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఓ పాప, బాబు ఉన్నారు. ఏదేమైనా చేసింది తక్కువ సినిమాలే అయినా సింధుమీనన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.