కొద్ది రోజులుగా బాలీవుడ్ లేడీ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ వర్సెస్ శివసేన మధ్య తీవ్రమైన వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే కంగనాపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఆమె వెనక బీజేపీ ఉందని కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై కంగనా తీవ్రస్థాయిలో ఎంపీ సంజయ్ రౌత్‌పై ధ్వజమెత్తింది. సెటైర్ వ్యాఖ్యలతో రౌత్ పై తీవ్రంగా మండిపడింది.
కంగనా ట్వీట్‌లో డ్రగ్ రాకెట్ మాఫియాను బద్దలు కొట్టిన వారికి బీజేపీ మద్దతు ఇవ్వడం దురదృష్టకరం… దీనికి బదులుగా పరువు తీసి, అత్యాచారాలు, దాడులు చేసే శివసేన గుండాలకు మద్దతు ఇవ్వాలా ? అని ప్రశ్నించారు. డ్రగ్ మాఫియాకు యాంటీగా పోరాడుతున్న ఓ మహిళకు మద్దతివ్వడానికి బీజేపీకి ఎంత ధైర్యం ? మీరు అంతే అంటారు కదా ? సంజయ్ జీ అంటూ కంగన వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
ఇక నటి కంగన వెనక బీజేపీ హస్తం ఉందని సామ్నా వేదికగా ఎంపీ రౌత్ ఆరోపించారు. బీజేపీ ఓ పద్ధతి ప్రకారమే ముంబై నగరాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా నటి కంగన పై వ్యాఖ్యలు చేసింది.