టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేస్తుంటారు. ఆయన తాజాగా మరోసారి టాలీవుడ్ నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేశారు. సినిమా పరిశ్రమంలో కొందరు లాబీయింగ్ చేయడం వల్లే థియేటర్లు మూతపడ్డాయన్న ఆయన 21 మంది నిర్మాతలు ఎల్ఎల్ఎల్‌పి అనే సంస్థను సినిమా రంగాన్ని శాసిస్తున్నారని మండిపడ్డాడు. థియేటర్లు మూత పడడం వల్ల కొన్ని చోట్ల ఫర్నీచర్ నాశనం అవుతోందని.. మరి కొన్ని చోట్ల ఫర్నీచర్‌ను దొంగలు కాచేస్తున్నారని.. ఇదంతా థియేటర్లు మూతపడడం వల్లే జరిగిందని నట్టి వాపోయారు.
రైళ్లు, విమానాల్లో సీటింగ్ కెపాసిటీ మార్చకుండా వాటితోనే రన్ చేస్తున్నారని… థియేటర్లు వచ్చేసరికి నిబంధనలు మార్చాలని ఎందుకు అంటున్నారని నట్టి మండిపడ్డారు. కరోనా సాకుతో థియేటర్లు ఓపెన్ చేయకపోతే త్వరలోనే అన్ని రాష్ట్రాల్లోనూ ఉద్యమం మొదలవుతుందని నట్టి హెచ్చరించారు. ప్రధానంగా ఓటీటీల వల్ల చిన్న సినిమాలు నష్టపోతున్నాయన్నాడు. థియేటర్ల మూసివేత సాకుతో ఓటీటీ ద్వారా పెద్ద హీరోల సినిమాలు విడుదల చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించాడు. ఏదేమైనా నట్టి వ్యాఖ్యలు టాలీవుడ్‌లో సంచలనం అయ్యాయి.