Moviesపోలీసులు అదుపులో టాలీవుడ్ హ‌ట్ హీరోయిన్‌..!

పోలీసులు అదుపులో టాలీవుడ్ హ‌ట్ హీరోయిన్‌..!

బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత మొద‌లైన డ్ర‌గ్స్ క‌ల‌క‌లం ఇప్పుడు క‌న్న‌డ సినిమా ప‌రిశ్ర‌మ అయిన శాండ‌ల్‌వుడ్‌కూ విస్త‌రించింది. క‌న్న‌డ సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప‌లువురు న‌టులు, న‌టీమ‌ణుల‌కు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు డ్ర‌గ్స్ లింకులు ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక శాండ‌ల్‌వుడ్ లో ఇప్ప‌టికే ఎవ‌రెవ‌రితో డ్ర‌గ్స్‌కు లింకులు ఉన్నాయ‌న్న కోణంలో సీసీబీ పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

ఇప్ప‌టికే క‌న్న‌డ చిత్ర‌సీమ‌కు చెందిన ప‌లువురి ఇళ్ల‌ల్లో సోదాలు నిర్వ‌హించిన పోలీసులు డ్ర‌గ్స్‌తో లింకులు ఉన్న‌ట్టు అనుమానాలు ఉన్న ప్ర‌తి ఒక్క‌రిని విచారిస్తుండ‌డంతో పాటు అరెస్టులు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే న‌టి రాగిణి దివ్వేదీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో న‌టి సంజ‌న ఇంట్లో కూగా సీసీబీ పోలీసులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. సంజ‌న ఈవెంట్ మేనేజ‌ర్ ప్రీత‌మ్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు బెంగళూరు ఇందిరానగర్లోని సంజన ఇంట్లో సోదాలు మొదలుపెట్టారు.

ఇక ఆమె ఇంట్లో డ్ర‌గ్స్‌తో లింకులు ఉన్న‌ట్టు కీల‌క ఆధారాలు దొరికితే ఆమెను అదుపులోకి తీసుకోవ‌డం గ్యారెంటీయే అంటున్నారు. ఇక డిజైన‌ర్ నియాజ్ ప‌లువురు శాండ‌ల్‌వుడ్ న‌టీమ‌ణులు, న‌టుల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు ఉండడంతో పోలీసులు నియాజ్‌ను ఇప్ప‌టికే అరెస్టు చేశారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news