టైటిల్: వి
నటీనటులు: నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదిథిరావు హైదరీ తదితరులు
థమన్: అమిత్ త్రివేది & ఎస్.థమన్
నిర్మాత: దిల్‌రాజు
దర్శకత్వం: మోహన్‌కృష్ణ ఇంద్రగంటి
రన్ టైం: 2.20 గంటలు
రిలీజ్ డేట్: 5, సెప్టెంబర్ 2020
నాని – సుధీర్ బాబు కాంబినేషన్లో వచ్చిన వి సినిమా ఇప్పటకి ఐదారు నెలల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. మార్చి 25న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా కరోనా, లాక్‌డౌన్ వల్ల వాయిదా పడింది. చివరకు ఇప్పట్లో థియేటర్లు తెరచుకునే ఛాన్సులు లేకపోవడంతో ఈ సినిమాను అమోజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ చేశారు. ఈ రోజు ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అయిన వి సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం దర్శకత్వం వహించారు. అదితి రావు హైదరీ, నివేదా ధామస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎలా ? ఉందో TL సమీక్షలో చూద్దాం.
కథ :
ఆర్మీలో పనిచేసిన విష్ణు ( నాని) ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ అనే వ్యక్తిని చంపేస్తాడు. ఈ క్రమంలో తాను మరో నలుగురిని చంపుతానని డీసీపీ ఆదిత్య ( సుధీర్‌బాబు)తో సవాల్ చేస్తాడు. డిపార్ట్‌మెంట్లో ఎంతో పేరున్న ఆదిత్య విష్ణు సవాల్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకుంటాడు. ఈ క్రమంలోనే ఆదిత్య కథ రాయడానికి వచ్చిన అపూర్వ అనే రచయిత ( నివేదా థామస్) కథ రాయడానికి వచ్చి అతడితో ప్రేమలో పడుతోంది. ఇక విష్ణు సవాల్ స్వీకరించిన ఆదిత్య ఆ హత్యలు జరగకుండా ఉండేందుకు ఎలాంటి ప్లాన్లు వేశాడు ? ఆర్మీలో పనిచేసిన విష్ణు ఈ దారుణ హత్యలో ఎందుకు చేస్తున్నాడు ? ఈ హత్యలకు సాహెబా (అదితి రావ్ హైదరి)కి సంబంధం ఏమిటి ? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ వీ సినిమా.
TL విశ్లేషణ :
నాని ఈ సినిమాలో తన సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇలాంటి సంక్లిష్టమైన పాత్రలో నాని నటించిన తీరుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. నాని పాత్రే సినిమాకు మేజర్ హైలెట్ అయ్యింది. ఇక నానికి పోటీగా డీసీపీ పాత్రలో సుధీర్‌బాబు కూడా ధీటుగానే నటించాడు. వీరిద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా వచ్చిన సన్నివేశాలు బాగున్నాయి. హీరోయిన్లు నివేద, హైదరీ అందంగా కనిపిస్తూనే తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతికంగా విజువల్ అండ్ సౌండ్ డిజైనింగ్ సినిమాకు సెట్ అయ్యింది. మంచి సౌండ్ సిస్టంలో చూసిన ఫీలింగ్ ఉంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన థమన్ ఇటీవల వచ్చిన థ్రిల్లర్ సినిమాల మేజర్ ట్యూన్స్‌ను దించేసినట్టే ఉంది. కొత్త దనం ఏ మత్రం లేదు. అమిత్ త్రివేది అందించిన పాటలు బాగున్నాయి. రవివర్మ ఫైట్స్‌లో ఏ ఒక్కటి ఆకట్టుకునేలా లేదు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ క్రిస్పీగా లేదు. ఫస్టాఫ్ ల్యాగ్ సీన్లను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.
మోహన్‌కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ కట్స్ :
ఎప్పుడో 2006లో జరిగిన వాస్తవ సంఘటలన ఆధారంగా తాను కథతో పాటు పాత్రలను రాశానని చెప్పాడు. ఈ సినిమా కథ రివేంజ్ స్టోరీయే. అయితే ఆడియెన్స్‌కు కావాల్సిన కిక్ కాని, ఎమోషనల్ కాని ఎక్కడా కనెక్ట్ అయినట్టు అనిపించదు. నాని, సుధీర్‌బాబు కోసం చాలా వరకు సినిమాను చూసినా ఒకానొక దశలో అసహనం కూడా కలుగుతుంది. స్క్రీన్ ప్లే మరీ స్లోగా ఉండడంతో చివరకు థ్రిల్లింగ్ సీన్లు కూడా వావ్ అనేట్టుగా లేవు. కొన్ని సీన్లు థ్రిల్లర్ సీరియల్స్ సీన్లను తలపించాయి. లవ్ ట్రాక్‌లోనూ అనేక పాత సినిమాల సీన్లే వాడేశారు. ఏదో కొన్ని సస్పెన్స్ సీన్లు మెప్పించినా ఓవరాల్‌గా సినిమా మొత్తంగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. డైరెక్షన్ పరంగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటికి ఇదో పెద్ద ఫెయిల్యూర్ అనే చెప్పాలి. గతంలో ఆయన ప్లాప్ సినిమాలు తీసినా కథ, దర్శకత్వం విషమంలో మంచి మార్కులు పడ్డా ఈ సినిమాకు అవి రెండు మైనస్ అయ్యాయి. దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్‌లు ( + ) :
– నాని నటన
– సుధీర్‌బాబు క్యారెక్టర్
– యాక్షన్ సీన్లు
– క్లైమాక్స్
మైనస్‌లు ( – ) :
– ఆర్ ఆర్
– స్లో నెరేషన్
– డైరెక్షన్
– కనెక్ట్ కాని ఎమోషన్
– రివేంజ్ డ్రామా రొటీన్ గా అనిపించడం
ఫైన్‌ల్‌గా…
వి అంటూ ఆరు నెలలుగా ఊరించి ఊరించి ఓటీటీలో రిలీజ్ అయిన ఈ థ్రిల్లర్ మూవీ యాక్షన్ వరకు ఆకట్టుకున్నా ఓవరాల్‌గా సినిమా పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. కథ, కథనాలు స్లోగా రన్ అవూత బోర్ కొట్టించాయి. నాని, సుధీర్‌బాబు మాత్రం తమ నటనతో సినిమాను లాగే ప్రయత్నం చేశారు. దర్శకుడు మెహన్‌కృష్ణ తన కెరీర్‌లోనే ఇంత బ్యాడ్ స్క్రిఫ్ట్ ఏ సినిమాకు ఎంచుకోలేదేమో అని చెప్పాలి. నాని అభిమానులకు మినహ ఏ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చదు.
వి TL రేటింగ్: 2 / 5