Gossipsవైసీపీ ఎంపీ రోల్లో ర‌వితేజ‌

వైసీపీ ఎంపీ రోల్లో ర‌వితేజ‌

మ‌లినేని గోపీచంద్ – మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కాంబినేష‌న్లో వ‌స్తోన్న సినిమా క్రాక్‌. గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన డాన్ శీను, బ‌లుపు లాంటి మాస్ హిట్ల త‌ర్వాత మ‌రోసారి వీరి కాంబినేష‌న్లో ఈ సినిమా వ‌స్తోంది. ఆ రెండు సినిమాలు హిట్ అవ్వ‌డంతో ఈ కాంబినేష‌న్లో ఈ సారి హ్యాట్రిక్ హిట్  ఖాయం అంటున్నారు. ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ర‌వితేజ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్లో అద‌ర‌గొడ‌తార‌ని అంటున్నారు. ఇక శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో ర‌వితేజ రోల్ వైఎస్సార్‌సీపీ ఎంపీ, మాజీ స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ గోరంట్ల మాధ‌వ్‌ను పోలీ ఉంటుంద‌ని వార్తలు వ‌స్తున్నాయి.

మాధ‌వ్ గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వంలో పోలీస్‌గా ఉన్న‌ప్పుడు అప్పుడు ఎంపీగా ఉన్న జేసీ దివాక‌ర్‌రెడ్డికి నాలుక చీరేస్తా అని వార్నింగ్ ఇవ్వ‌డంతో ఒక్క‌సారిగా హీరో అయ్యాడు. ఆ డేర్‌నెస్ చూసే వైసీపీ ఆయ‌న‌కు హిందూపురం ఎంపీ సీటు ఆఫ‌ర్ చేసింది. ఇక ఇప్పుడు ర‌వితేజ క్రాక్ కూడా గోరంట్ల మాధ‌వ్ రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎక్క‌డా త‌లొగ్గ‌కుండా వార్నింగ్‌లు ఇస్తూ త‌న వృత్తిని నిర్వ‌ర్తించాడో ఇప్పుడు క్రాక్ క‌థాంశం కూడా అదే అంటున్నారు.

ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్, ఓ పొలిటీషియన్ ని ఎలా ఢీకొన్నాడు ? త‌ర్వాత ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాయ‌న్న క‌థ‌తోనే ఈ సినిమా ఉంటుంద‌ట‌. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం టాలీవుడ్ ల‌వ‌ర్స్ ఎంతో ఆస‌క్తితో ఉన్నారు. మ‌రి ర‌వితేజ క్రాక్‌తో ఎలా దుమ్ము రేపుతాడో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news