నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు నటించిన వీ సినిమా ఈ నెల 5న అమోజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాను అమోజాన్ ప్రైమ్‌లో ఎంతమంది చూస్తారు అన్నదానిపై ఇప్పటి నుంచే లెక్కలు స్టార్ట్ అయ్యాయి. అమోజాన్ ప్రైమ్‌కు మనదేశంలో కోటి మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే తెలుగులో 20 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఇక వీ సినిమాకు ఇటీవల ఓటీటీ రిలీజ్‌లతో పోలిస్తే పబ్లిసిటీ కూడా తక్కువే ఉందన్న టాక్ వచ్చింది.
ఇక సినిమాకు ఉన్న మౌత్ టాక్‌ను బట్టి వీను పాత, కొత్త సబ్ స్క్రైబర్లు కలిపి ఓ 20 లక్షల మంది వరకు చూడవచ్చని అంటున్నారు. అదే థియేటర్లో సినిమాను రిలీజ్ చేస్తే ఎంత లేదన్నా యావరేజ్ అయినా కూడా నాలుగు వారాల పాటు బాక్సాఫీస్ రన్ ఉంటుంది. ఏ సెంటర్ నుంచి సీ సెంటర్ వరకు కనీసం కోటి మంది సినిమా చూస్తారు. ఇక వీ సినిమా విషయంలో నిర్మాత దిల్ రాజు సరికోత్త స్ట్రాటజీతో ఉన్నాడట.
అమోజాన్ ప్రైమ్‌లో సినిమాకు మంచి స్పందన ఉంటే ఆ తర్వాత దసరాకో లేదా సంక్రాంతికో థియేటర్లలో రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు భోగట్టా. క్రిస్మస్ లేదా సంక్రాంతికి థియేటర్లు తెరచుకునే అవకాశాలు ఉండడంతో అప్పటకి కరోనా హడావిడి కూడా తగ్గుతుందని దసరా కంటే ఈ రెండు సీజన్లలో ఏదో ఒక సీజన్‌కు సినిమాను ఎలాగైనా థియేటర్లలోకి తేవాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే సినిమా టాక్‌ను బట్టే ఇది ఉంటుంది.