నాగార్జునకు, అనుష్కకు మధ్య ప్రత్యేకమై రిలేషన్ ఉంది. నాగార్జున సూపర్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ తర్వాత నాగ్‌తో కలిసి ఓం నమోః వెంకటేశాయః, డాన్, ఢమరుకం ఇలా చాలా సినిమాలు చేసింది. నాగార్జున సినిమాలో చిన్న పాత్ర అయినా అనుష్క వెంటనే ఓకే చెప్పేస్తోంది. సాగ్గాడే చిన్ని నాయనా, కింగ్, కేడీ, ఊపిరి, తాండవం లాంటి సినిమాల్లో కూడా నటించారు. వీరి మధ్య రిలేషన్‌పై భారీగా వార్తలు వచ్చిన టైంలోనే ఏం జరిగిందో కాని వీరు కలిసి సినిమాలు చేయడం ఆపేశారు.
ఆ తర్వాత నాగచైతన్యకు, అనుష్కకు పెళ్లి జరుగుతుందని.. ఓ ప్రధాన మీడియాలో వార్త వచ్చింది. ఆ వార్త అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది. సదరు ప్రధాన దినపత్రికలో ఈ వార్త రావడం అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది. దీంతో నాగార్జునకు చిర్రెత్తు కొచ్చేసిందట. ఆగ్రహం పట్టలేక ఈ వార్త ప్రచురించిన మీడియా సంస్థకు తానే స్వయంగా వెళ్లి వీరలెవల్లో వార్నింగ్ ఇచ్చేశాడట. అప్పుడు నాగార్జున ఆ మీడియా సంస్థకు వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని మిగిలిన మీడియా సంస్థలు కూడా బాగా వైరల్ చేశాయి.
ఇక నాగార్జున సదరు మీడియా సంస్థ ఎండీతో ఉన్న పరిచయం నేపథ్యంలో నేరుగా వాళ్ల ఇంటికే వెళ్లి మరోసారి ఇలాంటి రాంగ్ కథనాలు రాయవద్దని సుతిమెత్తని వార్నింగ్ కూడా ఇచ్చేశాడట. ఆ వెంటనే అనుష్క కూడా అప్పట్లో మీడియా ముందుకు వచ్చి వీటన్నిటినీ కొట్టిపారేసింది. ఒక హీరోయిన్ కి తండ్రితో కొడుకుతో ఇలా లేని సంబంధాలు పెట్టడం అదే తొలిసారి.