Moviesబిగ్‌బాస్ కంటెస్టెంట్ల‌కు అప్పుడే షాక్‌... గంగవ్వ ఆర్మీ ర‌చ్చ స్టార్ట్‌

బిగ్‌బాస్ కంటెస్టెంట్ల‌కు అప్పుడే షాక్‌… గంగవ్వ ఆర్మీ ర‌చ్చ స్టార్ట్‌

తెలుగు బిగ్‌బాస్ తొలి మూడు సీజ‌న్లు ఎంతో ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలోనే నాలుగో సీజ‌న్ కూడా ప్రారంభ‌మైంది. సెప్టెంబ‌ర్ 6వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు మొద‌లైన ఈ షోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఉండ‌గా.. వీరిలో ఇద్ద‌రిని సీక్రెట్ రూంలో పెట్టేశాడు. ఇక బిగ్‌బాస్ స్టేజ్‌పై హోస్ట్ నాగార్జున సంద‌డి మామూలుగా లేదు. ఇక బిగ్‌బాస్ కంటెస్టెంట్ల‌లో చివ‌ర‌గా వ‌చ్చింది గంగ‌వ్వ‌. తెలంగాణ ప‌ల్లె యాస‌లో గంగ‌వ్వ వ‌చ్చీ రావ‌డంతోనే అద‌ర‌గొట్టేసింది. నాగార్జున‌తో మీరు మీ కొడుకుల అచ్చం అన్న‌ద‌మ్ములెక్క‌న ఉంటారే అని చెప్పింది. ఇక యూ ట్యూబ్‌లో మై విలేష్ షో ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన గంగ‌వ్వ తెలంగాణ యాస‌లో దుమ్ము దులిపేసింది.

ఇక స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి స్టార్స్‌ను సైతం ఇంట‌ర్వ్యూ చేసి నేష‌న‌ల్ మీడియా దృష్టిలో ప‌డింది. ఇక ఇప్పుడు ఆమె బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గానే గంగ‌వ్వ ఆర్మీ ర‌చ్చ స్టార్ట్ అయిపోయింది. #Gangavva #BiggBossTelugu4 హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తూ గంగవ్వ ఆర్మీ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. ఇక మిగిలిన కంటెస్టెంట్ల ఆర్మీల‌కు అప్పుడే గంగ‌వ్వ ఆర్మీ దూకుడుగా ఉండ‌డంతో పాటు స‌వాల్ విసురుతుంద‌నే చెప్పాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news