16 ఏళ్ల మైన‌ర్‌ను ప్రెగ్నెంట్ చేశారు… నిందితుల్లో పెంపుడు తండ్రి కూడా..!

తమిళనాడులో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల ఓ మైన‌ర్ బాలిక‌పై ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌లుమార్లు అత్యాచారం చేయ‌డంతో ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. ఇటీవ‌ల ఆ యువ‌తికి క‌డుపు నొప్పి రావ‌డంతో హాస్ప‌ట‌ల్‌కు తీసుకువెళ్లగా అస‌లు విష‌య బ‌య‌ట‌ప‌డింది. విషయం తెలుసుకున్న చైల్డ్ లైన్ అధికారులు, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు చెప్పిన వివ‌రాల ప్ర‌కారం బాధిత యువ‌తికి ఆమె ఇంటి స‌మీపంలోనే ఉన్న 29 ఏళ్ల వ్య‌క్తితో శారీర‌క సంబంధం ఉంది.

 

పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పిన యువ‌తిని ప‌లుమార్లు శారీర‌కంగా వాడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి పెంపుడు తండ్రి కూడా ఆ యువ‌తిపై వేధింపుల‌కు దిగాడు. నిందితులు ఇద్ద‌రు కూడా ఈ విష‌యం ఎవ‌రికి అయినా చెపితే అల్ల‌రి చేసేస్తామ‌ని బెదిరించి ప‌లుమార్లు ఆమెపై అత్యాచారం చేశారు. చివ‌ర‌కు బాలిక గర్భం దాల్చడంతో వీరి వేధింపులు వెలుగుచూశాయి. దీంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Leave a comment