హీరోయిన్ ఛాన్స్ కోసం న‌గ్న ఫొటోలు పంపి బుక్ అయిన అమ్మాయిలు..

వెబ్ సీరీస్‌ల‌లో హీరోయిన్ ఛాన్సులు ఇప్పిస్తామ‌ని… అందుకు మీ న‌గ్న ఫొటోలు పంపాలంటూ యువ‌తుల జీవితాల‌తో ఆట‌లు ఆడుకుంటోన్న ఓ ప్ర‌బుద్ధుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మాం చంద్ అలియాస్ దీప‌క్ అనే వ్య‌క్తి త‌న‌ను మ‌హిళా మోడ‌ల్‌గా ప‌లువురు యువ‌తుల‌తో ప‌రిచయం చేసుకుంటూ వెబ్ సీరిస్‌లో హీరోయిన్ ఛాన్సుల కోసం మెడ‌ల్స్ కావాల‌ని న‌మ్మిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ముందుగా రాశీ గోయల్‌ అనే వ్యక్తి ఓ బాధితురాలికి ఇన్‌స్టా గ్రామ్‌లో న‌గ్న చిత్రాలు కావాల‌ని మెసేజ్ పంపాడు.

 

ఈ బాధితురాలు త‌న న‌గ్న చిత్రాలు చాలా సార్లు ఇన్‌స్టాలో పంపింది. ఆ త‌ర్వాత రాశీ గోయ‌ల్ ప‌దే ప‌దే ఆ చిత్రాలు కావాల‌న‌డంతో బాధితురాలు ఆ ఇన్‌స్టాను బ్లాక్ చేసింది. త‌ర్వాత బాధితురాలికి ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి బెదిరింపు కాల్స్ రావ‌డంతో పాటు మీ న‌గ్న చిత్రాలు సోష‌ల్ మీడ‌డియాలో పెడ‌తామ‌ని బెదిరింపులు వ‌చ్చాయి. దీంతో ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

 

రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్‌ నెంబర్ల ఆధారంగా సుల్తాన్‌పురిలో ఓ ఇంట్లో ఉన్న నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు అంత‌కుముందే హరియాణాలోని హిసార్‌లో ఓ కేసులో అరెస్ట్‌ అయ్యాడని పోలీసులు చెప్పారు.

Leave a comment