Moviesఆమే లేక‌పోతే ప‌వ‌ర్ స్టార్ కోట్ల మంది అభిమాన హీరో అయ్యేవాడే...

ఆమే లేక‌పోతే ప‌వ‌ర్ స్టార్ కోట్ల మంది అభిమాన హీరో అయ్యేవాడే కాదు…!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ప‌వ‌ర్‌.. ఓ ఫోక‌స్‌.. తిరుగులేని ప‌వ‌ర్ స్టార్‌. ప‌వ‌న్ వెండితెర మీద క‌నిపిస్తే ఆయ‌న అభిమానులు ఎలా వేలం వెర్రిగా ఊగిపోతారో చెప్ప‌క్క‌ర్లేదు. అలాంటి ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఓ సంచ‌ల‌నం అయ్యాడు. ప‌వ‌న్‌కు రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు ప‌క్క‌న పెడితే ప‌వ‌న్ ఏం చేసినా ఓ సంచ‌ల‌న‌మే అన్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డెక్క‌డో ఉన్న కోట్లాది మంది అభిమానులు ప‌వ‌న్ సొంతం.

అయితే ప‌వ‌న్‌కు ఈ రోజు ఇంత క్రేజ్ ఉన్నా ప‌వ‌న్ ఈ స్థాయికి రావ‌డానికి కార‌ణ‌మైన ఓ మ‌హిళ ఉన్నారు. ఆమె ద‌య వ‌ల్లే ప‌వ‌న్ ఈ రోజు ఈ ప్ర‌పంచానికి తెలిసి కోట్ల మంది అభిమానించే హీరో అయ్యాడు. ఆమె ఎవ‌రో కాదు మెగాస్టార్ చిరు స‌తీమ‌ణి, ప‌వ‌న్‌కు వ‌దిన సురేఖ కొణిదెల‌. పవన్ సినిమాల్లోకి రాక‌ముందు ఇంటి ద‌గ్గ‌ర ఖాళీగా ఉండేవాడ‌ట‌.

త‌న రోజు వారి ఖ‌ర్చుల‌కు కూడా రామ్‌చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకుని గ‌డిపేవాడ‌ట‌. ఈ టైంలో చిరుతో సురేఖ క‌ళ్యాణ్ బాబు రూపం బాగుంటుంది.. చూడ‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటాడు… హీరోను చేస్తే బాగుంటుంద‌ని చెప్పింద‌ట‌. ముందు ఈ విష‌యంలో చిరు కాస్త త‌ట‌ప‌టాయించినా త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చి తిరుగులేని స్టార్ హీరో అయ్యాడు.

చివ‌ర‌కు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అక్క‌డ అమ్మాయి.. ఇక్క‌డ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమాల్లో మ‌కుటం లేని మహారాజుగా ప‌వ‌ర్ స్టార్ అవ్వ‌డంతో పాటు ఇటు రాజకీయంగా కూడా సంచ‌ల‌నాలు రేపుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news