Moviesప‌వ‌న్ - హ‌రీష్ శంక‌ర్ కాన్సెఫ్ట్ పోస్ట‌ర్... దేశ‌భ‌క్తుడే హీరో...!

ప‌వ‌న్ – హ‌రీష్ శంక‌ర్ కాన్సెఫ్ట్ పోస్ట‌ర్… దేశ‌భ‌క్తుడే హీరో…!

ఈ రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా వ‌రుస క్రేజీ అప్‌డేట్ల‌తో సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపేస్తున్నారు. ఉద‌యం వ‌కీల్‌సాబ్ మోష‌న్‌పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్ దుమ్ము రేపుతూ ట్రెండ్ అవుతుండ‌గానే వెంట‌నే ప‌వ‌న్ – సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్లో సినిమా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ ప్ర‌క‌ట‌న జోష్ నుంచి తేరుకోక‌ముందే క్రిష్ సినిమాలో ప‌వ‌న్ ప్రీ లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ జోష్‌లో ఉన్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు సాయంత్రం ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ మ‌రో బంప‌ర్ గిఫ్ట్ ఇచ్చేశాడు. హరీష్ శంకర్ తాను ప‌వ‌న్‌తో చేసే సినిమా పోస్టర్ విడుదల చేశారు. ఇది మా కాన్సెప్ట్ పోస్టర్ అని హరీష్ శంకర్ ఒక బండి మీద పుస్తకంతో పాటుగా ఆ పోస్టర్ లో స్వాతంత్య్ర‌ సమరయోధులు సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోలను ఉంచారు.

ఈ ఫొటోలు చూస్తే దేశ‌భ‌క్తికి సినిమాలో హీరోకు లింక్ ఉంటుంద‌ని తెలుస్తోంది. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ సినిమాను మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. వాస్త‌వానికి మూడేళ్ల క్రిత‌మే ప‌వ‌న్‌తో సినిమా చేసేందుకు మైత్రీ మూవీస్ వారు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. త‌ర్వాత ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డంతో ఈ ప్రాజెక్టు కాస్త ఆల‌స్యంగా ప‌ట్టాలు ఎక్కుతోంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ న‌టీస్తోన్న వ‌కీల్‌సాబ్ త‌ర్వాత క్రిష్ సినిమా కంప్లీట్ చేసి హ‌రీష్ శంక‌ర్ ప్రాజెక్టులో ప‌వ‌న్ జాయిన్ అవుతాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news