భార‌త్‌లో క‌రోనా క‌ల్లోలం… మ‌రో రికార్డు బ్రేక్‌

ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా క‌ల్లోలం భార‌త్‌లో మామూలుగా లేదు. తాజాగా భార‌త్‌లో క‌రోనా మ‌రో రికార్డు బ్రేక్ చేసింది. ఇక్క‌డ క‌రోనా 53 ల‌క్ష‌ల మార్క్ దాటేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన లెక్క‌ల ప్ర‌కారం గ‌త 24 గంట‌ల్లో క‌రోనా రికార్డు స్థాయిలో కేసులు న‌మోదు చేసింది. 24 గంట‌ల్లో ఏకంగా 93,337 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. 1,247 మంది మృతిచెందారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన క‌రోనా కేసులు చూస్తే 53 ల‌క్ష‌లు దాటేశాయి.

 

 

 

ఇక క‌రోనా మ‌ర‌ణాలు తాజా లెక్క‌ల‌ను కూడా క‌లిపితే 85,619 కే చేరాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా రిక‌వ‌రీ కేసులు 42 ల‌క్ష‌లు దాటేశాయి. ఇక శాతాల ప‌రంగా చూస్తే దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 78.86 శాతంగా యాక్టివ్ కేసులు 19.52 శాతంగా ఉంది. ఇక, మరణాల రేటు 1.62 శాతానికి తగ్గింది.

Leave a comment