ఏపీలో సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే రాజధాని వైజాగ్ తరలింపుపై ఉన్న హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు వచ్చే నెల 5వ తేదీ వరకు పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో రాజధానిని ఎంత త్వరగా వైజాగ్‌కు తరలించుకుపోతే అంత మంచిదని చూస్తోన్న జగన్‌కు లేటెస్ట్ షాక్ అనే చెప్పాలి.
తాజాగా రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖలో నూతన గెస్ట్ హౌస్ నిర్మాణం సైతం కోర్టు ధిక్కారణకు వస్తుందని ప్రశ్నించిన హైకోర్టు దీనిపై సీఎం సంతకంతో ఇప్పటి వరకు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని కూడా ప్రశ్నించింది. ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో వారం రోజులు గడువు కోరింది.
ఈ క్రమంలోనే హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విశాఖ గెస్ట్ హౌస్ నిర్మాణం కోర్టు ధిక్కరణగా పిటిషన్ వేశామని చెప్పారు. ఏదేమైనా కోర్టుల నుంచి వైసీపీ ప్రభుత్వానికి వరుస షాకుల పరంపరకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు.