ఉత్కంఠంగా అనుష్క నిశ్శ‌బ్దం ట్రైల‌ర్‌… అంతా స‌స్పెన్స్ థ్రిల్లింగే

స్వీటీ బ్యూటీ అనుష్క న‌టించిన నిశ్శ‌బ్దం ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ఓ పెయింటింగ్ కోసం అనుష్క – మాధ‌వ‌న్ ఓ హాంటెడ్ హౌస్‌కు వెళ్ల‌డంతో ఈ ట్రైల‌ర్ స్టార్ట్ అవుతుంది. ఇక ట్రైల‌ర్ అంతా స‌స్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంశాల‌తోనే కొన‌సాగుతోంది. అనుష్క ఓ పెయింటింగ్ కళాకారిణి అయిన మూగ యువతి సాక్షి పాత్రలో క‌నిపించింది. ఇక మాధ‌వ‌న్ ఆంథోనీ అనే మ్యూజిషియ‌న్‌గా క‌నిపించాడు. అనుష్క బెస్ట్ ఫ్రెండ్ షోనాలి పాత్రలో షాలిని పాండే న‌టించింది.

 

ఇక ఎంగేజ్మెంట్ అయిన రెండో రోజు నుంచే షోనాలి క‌న‌ప‌డ‌కుండా పోవ‌డంతో ఆమె పాత్ర‌కు సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. మొత్తానికి ట్రైల‌ర్లో చాలా స‌స్పెన్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నింపేశారు. భాగ‌మ‌తి త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని అనుష్క న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక గాంధీ జ‌యంతి కానుక‌గా అక్టోబ‌ర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

 

 

Leave a comment