మాస్ మ‌హ‌రాజ్‌తో ఎమ్మెల్యే చిందులు…!

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ప్ర‌స్తుతం క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత రాక్ష‌సుడు ఫేం ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాలో ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్లో చేస్తాడ‌ని టాక్‌. ఈ సినిమాలో కూడా ఇద్ద‌రు హీరోయిన్లు ఉండ‌గా.. ఆ ఇద్ద‌రు హీరోయిన్లు కూడా ఇస్మార్ట్ శంక‌ర్ జోడీ అయిన న‌భా న‌టేష్‌తో పాటు నిధి అగ‌ర్వాల్‌ను ఎంపిక చేశార‌ని టాక్‌..?  ఇక ఓ స్పెష‌ల్ సాంగ్‌లో మాత్రం ర‌వితేజ ప‌క్క‌న ఊర‌మాస్ డ్యాన్స్ చేసేందుకు లేడీ ఎమ్మెల్యే కేథ‌రిన్ థెస్రాను ఎంపిక చేశార‌ట‌.

 

ఇటీవ‌ల కేథ‌రిన్ తమిళ్‌లో ఎక్కువుగా ఫోక‌స్ చేస్తూ తెలుగుపై కాన్‌సంట్రేష‌న్ చేయ‌డం లేదు. దీంతో ఆమెకు అవ‌కాశాలు కూడా ఇక్క‌డ త‌క్కువ‌గానే ఉన్నాయి. ఈ టైంలో ర‌వితేజ ప‌క్క‌న ఈ లేడీ ఎమ్మెల్యే చేసే స్పెష‌ల్ సాంగ్‌తో అయినా ఆమెకు ఇక్క‌డ ఊపు వ‌స్తుందేమో ?  చూడాలి. ఇక ర‌వితేజ‌కు రాజా ది గ్రేట్ త‌ర్వాత హిట్ లేదు. వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో మ‌నోడు మార్కెట్ డ‌ల్ అయిపోయింది. మ‌రి ఇప్పుడు క్రాక్‌తో పాటు ర‌మేష్ వ‌ర్మ సినిమా అయినా లైఫ్ ఇస్తాయేమో ?  చూడాలి.

Leave a comment