బ్రేకింగ్‌: కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేకు క‌రోనా

ఏపీలో క‌రోనా అధికార వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల‌ను వ‌ద‌ల‌డం లేదు. ఇటీవ‌లే తిరుప‌తి ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ క‌రోనా భారీన ప‌డి మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మ‌రొక‌రు క‌రోనా భారీన ప‌డ్డారు. ఇప్ప‌టికే ఇదే జిల్లాకు చెందిన జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను క‌రోనా భారీన ప‌డ‌గా.. ఇప్పుడు నందిగామ ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్మోహ‌న్‌రావు సైతం క‌రోనాకు గుర‌య్యారు.

 

 

 

రెండు రోజుల నుంచి అస్వ‌స్థ‌త‌తో ఉన్న ఆయ‌న కోవిడ్ ప‌రీక్ష చేయించుకోగా ఆయ‌న‌కు పాజిటివ్ వ‌చ్చింది. గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారంతా జగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఇక మొండితోక జ‌గ‌న్మోహ‌న్ రావు 2014లో ఎమ్మెల్యేగా ఓడినా… గ‌తేడాది ఎన్నిక‌ల్లో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు.

Leave a comment