బ్రేకింగ్‌: ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు కొత్త శాఖ‌లు కేటాయించిన జ‌గ‌న్‌…

కొద్ది రోజుల క్రిత‌మే త‌న కేబినెట్లోకి ఇద్ద‌రు కొత్త మంత్రుల‌ను తీసుకున్న జ‌గ‌న్ తాజాగా మ‌రో ఇద్ద‌రు మంత్రుల‌కు కొత్త శాఖ‌ల‌ను కేటాయించారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినెట్లో సీనియ‌ర్‌ మంత్రిగా ఉన్న‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి  గ్రామ సెక్రటరీలు, వలంటీర్ల బాధ్యతలను కేటాయించారు. ఇక‌పై ఈ రెండు శాఖ‌ల వ్య‌వ‌హారాల‌ను కూడా ఆయ‌నే ప‌ర్య‌వేక్షిస్తారు.

 

అలాగే మ‌రో సీనియ‌ర్ మంత్రి బొత్స వార్డు సెక్రటరీలు, వలంటీర్ల బాధ్యతలను చూస్తారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కొద్ది రోజుల క్రిత‌మే జ‌గ‌న్ కేబినెట్లోకి మంత్రులుగా సీదిరి అప్ప‌ల‌రాజు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కొత్త‌గా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Leave a comment