ఎన్టీఆర్ ప‌క్క‌న ఉన్న ఈమెను గుర్తు ప‌ట్టారా.. వీరిద్ద‌రి రిలేష‌న్ ఇదే..!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప‌క్క‌న ఉన్న ఆమె ఎవ‌రో మీకు తెలుసా ?  ఆమెను గుర్తు ప‌ట్టారా ?  ఆమె ఎవ‌రో కాదు.. ఎన్టీఆర్ సోద‌రి చుండ్రు సుహాసిని. దివంగ‌త మాజీ మంత్రి, నంద‌మూరి హ‌రికృష్ణ ముద్దుల వార‌సురాలు. హ‌రికృష్ణ‌కు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌, జాన‌కీరామ్‌, సుహాసిని తొలి భార్య సంతానం కాగా.. రెండో భార్య సంతాన‌మే ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ సుహాసినిని త‌న సొంత సోద‌రిలా చూసుకుంటారు.

 

గ‌తంలో ఈ రెండు కుటుంబాల చిన్న గ్యాప్ ఉన్నా.. జాన‌కీ రామ్ మృతి త‌ర్వాత వీరంతా ఒక్క‌ట‌య్యారు. ఇక సుహాసిని అత్తారిల్లు తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ‌. ఆమె కాకినాడ మాజీ ఎంపీ చుండ్రు శ్రీహ‌రి కోడ‌లు. ఎన్టీఆర్ అంటే ఎంతో అప్యాయంగా ఉండే సుహాసిని 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

 

ఎన్టీఆర్ ప్ర‌తి సినిమాను త‌న అక్క‌కు స్పెష‌ల్‌గా ముందే చూపిస్తాడ‌ట‌. ఇక ఆమె ప్ర‌తి రాఖీ పండ‌క్కు ఎన్టీఆర్‌కు రాఖీ క‌డుతుంది. ఇక ఆమె హైద‌రాబాద్‌లోని ట్యాంక్‌బండ్ స‌మీపంలో నివాసం ఉంటుంది. ఆమె భ‌ర్త ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌.

Leave a comment