ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పోర్న్ వీడియోలు చూసే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. లాక్‌డౌన్ సమయంలో ఈ పోర్న్ వీడియోలు చేసే వారి సంఖ్య, చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇక మనదేశంలో పోర్న్ సైట్లను కేంద్ర ప్రభుత్వం డిలీట్ చేస్తున్నా ప్రతి రోజు కొత్త పోర్న్ సైట్లు పుట్టుకు వస్తున్నాయి. ఇది ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఉత్తర కొరియాలో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆ దేశ అధ్యక్షుడు, నియంత కిమ్‌జాంగ్ ఉన్ తమ దేశ కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో తెలిసిందే. అక్కడ మీడియాపై సైతం, నెట్ వాడకంపై తీవ్రమైన ఆంక్షలు ఉంటాయి. అక్కడ వార్తలు చేరవేసేందుకు కేవలం మూడు ఛానెల్స్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అవన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండేవే. ఇక తమ దేశంలో నీలి చిత్రాలు చూసే యువతీ, యువకులను కఠినంగా శిక్షించాలని కిమ్ ఆదేశాలు జారీ చేశాడు.
ఇక కిమ్ ఇటీవల మరింత క్రూరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కరోనా వల్ల పౌల్ట్రీ ఉత్పత్తులు పడిపోవడంతో కుక్కలను చంపి మాంసాహారాన్ని ప్రోత్సహించమని సూచించాడు. ఇక అక్కడ బలమైన ప్రత్యర్థులు లేక 60 ఏళ్లుగా కిమ్ కుటుంబీకులే ఉత్తర కొరియాను ఏలుతున్నారు.