ఆ కండీష‌న్‌కు సైఫ్ ఒప్పుకున్నాకే క‌రీనా పెళ్లి చేసుకుందా..!

బాలీవుడ్ న‌టి క‌రీనా క‌పూర్ త‌న‌కంటే వ‌య‌స్సులో ప‌దేళ్లు పెద్ద వాడు అయిన సైఫ్ ఆలీఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంత‌కుముందే సైఫ్‌కు త‌న‌కంటే వ‌య‌స్సులో చాలా పెద్ద‌ది అయిన అమృతా ఆరోరాతో పెళ్ల‌య్యి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఆమెకు విడాకులు ఇచ్చాక సైఫ్ క‌రీనాను పెళ్లాడాడు. అంత‌కుముందే క‌రీనా – షాహిద్ క‌పూర్ ప్రేమించుకున్నారు. వారి ప్రేమ‌కు బ్రేక‌ప్ వ‌చ్చిన వెంట‌నే క‌రీనా సైఫ్‌కు ద‌గ్గ‌రైంది.

 

ఆమె కెరీర్ ప‌రంగా ఫామ్‌లో ఉండ‌గ‌నే సైఫ్‌ను పెళ్లాడింది. ఓ సినిమా షూటింగ్‌లో వీరి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఆ సినిమా ప్లాప్ అయినా వీరి లవ్ మాత్రం సక్సెస్ అయ్యింది. ఇక  ఈ రోజు క‌రీనా 40వ పుట్టిన రోజు జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే సైఫ్‌ను పెళ్లాడిన‌ప్పుడు క‌రీనా ఓ కండీష‌న్ పెట్టింద‌ట‌. పెళ్ల‌యినా తాను సినిమాల్లో న‌టిస్తాన‌ని చెప్పింద‌ట‌. దీనికి సైఫ్ ఒప్పుకోవడం తో పెళ్లి నిరాటంకం గా కొనసాగింది. 2012లో వీరి పెళ్లి జ‌ర‌గ‌గా వీరికి తైమూర్ అనే కుమారుడు ఉన్నాడు.

Leave a comment