బిగ్‌బాస్ మంట పెట్టేశాడు… వీళ్ల మ‌ధ్య ర‌చ్చ రంబోలాయే..!

నిన్న‌టి వ‌ర‌కు బిగ్‌బాస్ స‌భ్యులు అంద‌రూ సేఫ్ గేమ్ ఆడుతూ వ‌చ్చారు. ఎట్ట‌కేల‌కు బిగ్‌బాస్ పెట్టిన ఫిటింగ్‌తో ఈ రోజు నుంచి ర‌చ్చ రంబోలా షురూ కానుంది. హౌస్‌లో ఒక‌రి గురించి మ‌రొక‌రు ఏం అనుకుంటున్నారు ?  తెర‌వెన‌క ఎవ‌రు డ్రామాలు ఆడుతున్నారు ? అనే విష‌యంలో క్లారిటీ వ‌చ్చేలా చేశాడు. ఇక ఎలిమినేష‌న్ విష‌యంలో స‌భ్యులు సెల్ఫ్ నామినేష‌న్ చేసుకోవ‌డంపై బిగ్‌బాస్ సీరియ‌స్ అయ్యాడు.

 

 

ఇక హీరో, విల‌న్ టాస్క్ వ‌చ్చిన‌ప్పుడు, ఫేక్ ఎలిమినేష‌న్ జ‌రిగిన‌ప్పుడు మోనాల్ గ‌జ్జ‌ర్‌, హారిక గురించి ఇంటి స‌భ్యులు చెప్పిన విష‌యాలు, క‌ళ్యాణి వెళ్లిపోయే ట‌ప్పుడు ఒక్కొక్క‌రి గురించి చెప్పిన విష‌యాలు ఈ రోజు నుంచి గేమ్‌లో త‌ప్ప‌కుండా ప్ర‌భావం చూప‌నున్నాయి. ఇక లాస్య‌, దివి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ కూడా కుంప‌ట్లు రాజేసింది. ఇక మోనాల్ అబ‌ద్ధాలు ఆడిందంటూ దివి చెప్ప‌డంతో ఇక వీరిద్ద‌రి మ‌ధ్య వార్ మామూలుగా ఉండేలా లేదు.

 

ఇక అమ్మ రాజ‌శేఖ‌ర్‌ను దేవి, లాస్య టార్గెట్ చేయ‌డం.. నోయ‌ల్ గురించి కూడా కొంద‌రు విమ‌ర్శ‌లు చేయ‌డం వంటి సంఘ‌ట‌న‌లు, మ‌రోవైపు గ్రూపిజం స్టార్ట్ అయ్యింద‌న్న చ‌ర్చ‌లు, దేవి ఈ వారం డైరెక్టుగా ఎలిమినేష‌న్లో ఉండ‌డం లాంటి సంఘ‌ట‌న‌లు అన్ని బిగ్బాస్‌ను మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార్చేశాయి. ఇక దేత్త‌డి హారిక స్ట్రాంగ్ కాద‌ని మెహ‌బూబ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో పాటు ఫేక్ ఎలిమినేష‌న్లో హారిక‌, నోయ‌ల్‌కు స‌భ్యులు ఓట్లేసినప్పుడు కూడా స‌భ్యులు చీలిపోవ‌డం స్ప‌ష్టంగా క‌నిపించింది. ఈ వారం అంతా షోలో గొడ‌వ‌లు మామూలుగా ఉండేలా లేవు.

Leave a comment